సింగిల్ షెడ్యూల్‌లో ‘కలియుగం పట్టణంలో’ చిత్రీకరణ

0
146

నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

కలియుగం పట్టణంలో టైటిల్ పోస్టర్‌తోనే సినిమా మీద జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు శర వేగంగా సినిమాను పూర్తి చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను నిర్మాతలు ఇచ్చారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్‌లో పూర్తి చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం నిర్మాత ఎక్కడా కూడా కాంప్రైమజ్ కాకుండా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మొత్తం తారాగణం అంతా పాల్గొంటోంది. సెట్‌లో సందడి వాతావరణం కనిపిస్తోందని, అంతా పాజిటివ్ ఎనర్జీ ఉందని మేకర్లు చెబుతున్నారు.

ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

నటీనటులు
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్

బ్యానర్ :నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ,
నిర్మాతలు : డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి,గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రమాకాంత్ రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : చరణ్ మాధవనేని
సంగీత దర్శకుడు: అజయ్ అరసాద
ఎడిటర్: గ్యారీ బి .హెచ్
లిరిక్స్: చంద్రబోస్, భాస్కరభట్ల
ఆర్ట్ డైరెక్టర్: రవి
స్టంట్స్ : ప్రేమ్ సన్
కొరియోగ్రాఫర్: మొయిన్ మాస్టర్
పి. ఆర్. ఓ : సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here