మాస్ మహారాజా రవితేజ హీరోగా మారిన తొలినాళ్లలో తనకి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రాలలో దొంగోడు ఒకటి. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు తో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రవితేజ, కల్యాణి జంటగా రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన దొంగోడు మాస్ ఎలిమెంట్స్ తో, కామెడీ తో ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ గా నిలిచింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘మీస మాధవన్’ (దిలీప్, కావ్య మాధవన్) ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రేఖ మరో హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఉత్తేజ్, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, షకీలా, పవిత్రా లోకేశ్, వర్ష, ఉమ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, రంజిత, దువ్వాసి మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
చిన్నప్పుడు చెల్లి ఆకలి తీర్చడానికని తొలిసారిగా దొంగతనం చేసిన మాధవ (రవితేజ) చోర కళ నే వృత్తిగా చేసుకుని తనకి అన్యాయం చేసిన వారి మీద పగ తీర్చుకోవడం కోసం, ఆపద లో ఉన్నవారిని ఆదుకోవడం కోసం దొంగతనాలు చేస్తుంటాడు. మాధవ ఎవరినైనా చూస్తూ మీసం మేలేస్తే, వారింట్లో ఇంట్లో దొంగతనం జరగడం ఖాయమన్నట్లుగా ఊర్లో పేరుంటుంది. అలాంటి మాధవ.. దుష్టుడైన ఆ ఊరి భూస్వామి నాయుడు (తనికెళ్ళ భరణి)తో వ్యక్తిగత సమస్య ఉంటుంది. మరోవైపు నాయుడు కూతురు రుక్మిణి మొదట్లో మాధవని ద్వేషించినా.. అతని మంచితనం తెలిసి ప్రేమిస్తుంది. ఇదిలా ఉంటే, రుక్మిణిపై కన్నేసిన ఎస్. ఐ (రియాజ్ ఖాన్) మాధవ చేయని దొంగతనాన్ని అతనిపై అంటకడతాడు. ఈ క్రమంలో.. మాధవ రుక్మిణి సహాయంతో తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు? అన్నది మిగిలిన సినిమా.
రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పాటూ భీమనేని
విద్యాసాగర్ సంగీతమందించిన ఈ చిత్రానికి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, బండారు దానయ్య సాహిత్యమందించారు. “కోడి ముందా”, “మీసాల గోపాల”, “ఎంత పనిజేసిందే”, “సొట్గ బొగ్గల”, “డుమ్ డుమ్ డుమ్”, “దొంగ దొంగ” (థీమ్ సాంగ్).. పాటలన్నీ ఆకట్టుకున్నాయి. భీమనేని శ్రీనివాసరావు దర్శత్వం వహించి నిర్మించిన ‘దొంగోడు’ 2003 ఆగస్టు 7న విడుదలయ్యి ప్రేక్షకాదరణ తో సూపర్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంది.