సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM ‘నుంచి లవ్లీ మెలోడీ నీలా నన్నిలా పాట విడుదల  

0
115

బలమైన కంటెంట్‌తో కూడిన విలక్షణమైన సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్ కథనంలో కొత్తదనంతో కూడిన యూనిక్ సినిమాలని ప్రయత్నిస్తున్నారు. సాహస్, దీపిక నటించిన చిత్రం 7:11 PM. చైతు మాదాల దర్శకత్వం వహించారు. ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. 7:11 PM హైలీ స్క్రీన్‌ప్లేతో నడిచే కమర్షియల్ చిత్రం. ఇది టైమ్ ట్రావెల్, ఇంటర్‌స్టెల్లార్ ట్రావెల్‌తో డబ్బు , టైం బౌండ్ సంఘటనలు కూడిన క్రైమ్ డ్రామా. ఇండియా, ఆస్ట్రేలియాలోని వివిధ లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

సినిమా కథ విషయానికి వస్తే, 1999లో ఒక ముఖ్యమైన రోజున, భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం “హంసలదీవి” అనే చిన్న ఇండియన్ టౌన్ కి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్ ని నాశనం చేయడానికి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ ఫాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్ గా సీట్ ఎడ్జ్ అనుభూతిని పంచుతాయి.

మేకర్స్ ఇదివరకు విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది. సినిమా నుండి మొదటి సింగిల్ నీలా నన్నిలా పాట విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ జర్నీ ని ప్రారంభించారు. గ్యాని స్కోర్ చేసిన ఈ లవ్లీ మెలోడీ మెస్మరైజ్ చేస్తోంది.

ఈ బ్యూటీఫుల్ నెంబర్ లీడ్ పెయిర్ లవ్ జర్నీ చూపిస్తోంది.అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడగా  మణి దీపక్ కడిమిశెట్టి ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యాన్ని రాశారు. సాహస్,  దీపిక మధ్య లవ్లీ  కెమిస్ట్రీతో విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఈ చిత్రానికి శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీని అందించగా శ్రీను తోట ఎడిటర్.

తారాగణం – సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు & ఇతరులు

దర్శకత్వం – చైతు మాదాల
నిర్మాత – నరేన్ యనమదల, మాధురి రావిపాటి & వాణి కన్నెగంటి
సంగీతం – గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె / జై లోగిశెట్టి
డీవోపీ – శివ శంకర్ / ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్ – శ్రీను తోట
పీఆర్వో – వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here