రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మొదటి చిత్రం ‘ది ఇండియా హౌస్’ పవర్ ప్యాక్డ్ మోషన్ వీడియో ద్వారా అనౌన్స్ మెంట్

0
104

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ప్రొడక్షన్ బ్యానర్ ‘వి మెగా పిక్చర్స్’ని ప్రారంభించడం ద్వారా తన కెరీర్‌లో ఒక కీలకమైన అడుగు వేశారు. వినూత్న కథలని రూపొందించడంతో పాటు చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంగా యూవీ క్రియేషన్స్‌కి చెందిన తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి V మెగా పిక్చర్స్ కు శ్రీకారం చుట్టారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్… ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి నిజ, వాస్తవమైన కంటెంట్‌కి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్.

‘వి మెగా పిక్చర్స్’, ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ తమ మొదటి ప్రాజెక్ట్ – ‘ది ఇండియా హౌస్’ని అనౌన్స్ చేశాయి. ఈ అసోసియేషన్ తొలి ప్రాజెక్ట్ లో ప్రతిభావంతులైన నటులు, నైపుణ్యం కలిగిన టెక్నికల్ టీమ్ భాగమయ్యారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్ స్టార్ లైన్-అప్.

ఈరోజు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పవర్ ప్యాక్డ్ వీడియో ని విడుదల చేశారు.

ప్రేక్షకులను ఒక కాలాని తీసుకెళ్లి, వారి హృదయాలను హత్తుకుని కథలో లీనమయ్యేలా ఇండియా హౌస్ సిద్ధమైంది. లండన్‌లో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన నేపథ్యంలో టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం ది ఇండియా హౌస్ చుట్టూ రాజకీయ అలజడి సమయంలో ఒక ప్రేమకథను చూపిస్తోంది. రాబోయే డ్రామాను సూచిస్తూ.. ఇండియా హౌస్ కాలిపోతున్న దృశ్యంతో టీజర్ ముగుస్తుంది.

V మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శక్తివంతమైన భాగస్వామ్యానికి నాంది పలికింది.

గ్లోబల్ ఫోర్స్‌గా పేరుపొంది, దేశం గర్వించేలా చేశారు రామ్ చరణ్. అభిషేక్ అగర్వాల్ కంటెంట్ ఆధారిత సినిమాలను నిర్మించాలనే దృక్పథంతో అత్యుత్తమ నిర్మాతలలో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారు.

భారతీయ సినిమానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here