అరంగేట్రం మూవీ రివ్యూ

0
546

సైకో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా రూపొందిన అరంగేట్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. శ్రీనివాస్ ప్ర‌భ‌న్ హీరోగా స్వీయ దర్శకత్వంలో, పూజ హీరోయిన్ గా… ముస్తఫా అస్కరి, రోషన్, సాయిశ్రీ, ఇందు ప్రధాన పాత్ర ధారులుగా నటించిన చిత్రాన్ని మ‌హి మీడియా వ‌ర్క్స్ పతాకంపై మ‌హేశ్వ‌రి కె. ఈ నిర్మించారు. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘కవచం’ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ ప్రభన్… ఈసారి ఓ డిఫరెంట్ జోనర్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వచ్చారు. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం.

కథ:

ప్రభన్ (శ్రీనివాస్ ప్రభన్) ఓ అనాథ. తల్లి చనిపోడంతో చదువును మధ్యలోనే ఆపేసి పెయింటర్ గా మారతాడు. తన చిన్నతనంలోనే మేఘన (పూజ)ని ప్రేమిస్తాడు. తల్లి చనిపోవడంతో ఆ ప్రేమ విఫలం అవుతుంది. దాంతో ఆ చిన్నప్పటి ప్రేమ తాలూకు జ్ఞాపకాలు అతనిని వెంటాడుతూ ఉంటాయి. మరోపక్క ప్రతి నెల 13వ తేదీన ఒక అమ్మాయి హత్యకి గురవుతూ ఉంటుంది. ఈ హత్యలు జరిగే క్రమంలో  మేఘన అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఈ మరణం వెనుక ఉన్నది ఎవరు… అతని మోటివ్ ఏంటి అనే యాంగిల్ లో పోలీసులకంటే వేగంగా ఆ మరణం వెనుక ఉన్న వ్యక్తి ఆచూకీని ఎలా కనుగొన్నాడు? ఆ సైకో వ్యక్తి ఆటను ఎలా కట్టించాడు అనేదే మిగతా కథ.

నటీనటుల పనితీరు:

దర్శకుడు శ్రీనివాస ప్రభన్ హీరోగా కూడా నటించి… కథ, కథనాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో  విజయం సాధించారు. దర్శకత్వంతో పాటూ నటుడిగా కూడా మెప్పించారు. సైకో పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. నటుడు ముస్త‌ఫా అస్క‌రి సైకో పాత్రలో బాగా చేశారు. అందుకు తగ్గట్టుగా తన మేకవర్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే సైకో పాత్రలో చైల్డ్ క్యారెక్టర్ పోషించిన రోషన్ మరోసారి మెప్పించాడు. ఇటీవల విడుదలై బ్లక్ బస్టర్ సాధించిన ‘విరూపాక్ష’ చిత్రంలోనూ విలన్ పాత్రను ఫ్లాష్ బ్యాక్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎలా ఆకట్టుకున్నాడో… ఇందులో కూడా ఇంచు మించు అలాంటి పాత్రలోనే ఓ డిఫరెంట్ యాంగిల్ లో కనిపించి మెప్పించాడు. హీరోయిన్ పూజా పాత్ర కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఆకట్టుకుంటుంది. జర్నలిస్ట్ గా… సంయుక్త పాత్రలో కనిపించిన సాయిశ్రీ పర్వాలేదు అనిపించింది. మిగిలిన పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇలాంటి తరహా చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. సంగీత దర్శకుడు గిడియాన్ క‌ట్టా అందించిన బీ జీ ఎమ్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ హైలైట్ గా నిలిచింది.  బుర‌న్ షేక్‌ (స‌లీమ్‌) అందించిన సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది.  గ్రిప్పింగ్ గా సినిమాని కుదించడంలో ఎడిటర్ మధు చాలా బాగా వర్క్ చేశారు. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాని ఎడిట్ చేయడంలో మధు సక్సెస్ అయ్యారు. ఇంత బాగా సినిమా రావడానికి కో-డైరెక్టర్ కం ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ ర‌మేష్ బాబు చిన్నం(గోపి) కృషిని… సినిమాని ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా తీసిన నిర్మాత మ‌హేశ్వ‌రి.కె ని అభినందించాలి. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా ఉన్నాయి.

విశ్లేషణ:

సైకో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేసే జానర్. అందుకే కొత్త దర్శకులు ఇలాంటి కథలను ఎంచుకుని చిత్ర పరిశ్రమలో విజయాలు సాధిస్తున్నారు. ఈ జోనర్ సినిమాలకు స్టార్ కాస్ట్ తో పని లేదు. గ్రిప్పింగ్ గా కథ, కథనాలను రాసుకుంటే బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టొచ్చు. తాజాగా తెరకెక్కిన ‘అరంగేట్రం’ చిత్రం విషయంలో కూడా దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పాటు మెయిన్ లీడ్ హీరోగా నటించి మెప్పించారు. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ నటించిన ‘కవచం’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన… ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలతో పాటు… హీరోగా కూడా ఈ చిత్రంతో ‘అరంగేట్రం’ చేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి శుభం కార్డు వరకు ఎక్కడా డీవియేట్ కాకుండా… తాను రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లేను చాలా గ్రిప్పింగ్ గా తెరమీద చూపించారు.

ఫస్ట్ హాఫ్ లో ఓ సైకో చేతిలో అమ్మాయిలు దారుణంగా వరుసగా చంపబడుతుంటారు. దాని వెనక ఉన్న మొటీవ్ ని ఛేదించడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు… తరువాత హీరో పాత్ర కూడా ఓ సస్పెక్ట్ గా ఎంట్రీ ఇవ్వడం… ఇంటర్వెల్ బ్యాంగ్ లో అసలు సైకో పాత్రను రివీల్ చేయడం.. లాంటి ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే… సెకెండాఫ్ పై ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్ ని పెంచేస్తుంది. ఈ పాత్రల్లో ఎక్కడా స్టార్ కాస్ట్ కనిపించదు. కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయంటే… స్టోరీ, స్క్రీన్ ప్లేలో ఎంత పట్టుందో అర్థమవుతుంది. ఇక సెకెండాఫ్ లో సైకో చేస్తున్న వరుస హత్యల వెనుక దాగివున్న మొటీవ్ ను కూడా ఇందులో డిఫరెంట్ గా చూపించడం ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా వుంది. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా వ్యవహరించకూడదు, అక్రమ సంబంధాల వల్ల విడిపోయిన తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది అనేది ఓ మెసేజ్ రూపంలో కూడా ఇచ్చాడు దర్శకుడు. ఎంగేజింగ్ గా సాగే ‘అరంగేట్రం’ మూవీ… ఇలాంటి జోనర్ ని ఇష్టపడే వాళ్లని అలరిస్తుంది.

రేటింగ్: 3.25 / 5

చివరగా : ఆసక్తికరమైన పాత్రలతో ఎంగేజ్ చేసే సైకో క్రైం థ్రిల్లర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here