ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది. ఈ శ్రీ రామ నవమి నుంచి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఈ సందర్బంగా దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆశిస్సులు అందుకున్నారు.
To a Mangalkaari Shurwaat! Producer #BhushanKumar and Director #OmRaut reach Vaishno Devi to seek blessings for #Adipurush!#Adipurush releases IN THEATRES on June 16, 2023 in 3D.#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar… pic.twitter.com/ftVKgMmqGi
— Shiva Kumar B (@ShivaKumarB22) March 28, 2023
ఈ 2023 లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచిన ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీ రాముడిని, కృతి సీతను, సైఫ్ అలీఖాన్ రావణుడిని పోలిన పాత్రల్లో కనిపించబోతున్న్నారు. హనుమంతుడుగా సన్నీ సింగ్ నటించాడు. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ .. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ఆదిపురుష్ తో ప్రభాస్ మరో భారీ హిట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ నెల 30 నుంచి భారీ స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి.
ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తో సిరీస్, భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ లు యూ.వి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.