సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. పెద్ద బ్యాకింగ్ ఉన్న సినిమాలంటే క్రేజ్ రెట్టింపు అవుతుంది. #VNRTrio- వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన తమ గత చిత్రం ‘భీష్మ’ కంటే పెద్ద విజయాన్ని అందించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.
అనౌన్స్ మెంట్ వీడియో ఫన్నీగా ఉండటంతో మేకర్స్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఈ చిత్రం మరింత వినోదాత్మకంగా, మరింత అడ్వెంచరస్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ డెడ్లీ కాంబినేషన్ లోని క్రేజీ ప్రాజెక్ట్ ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైయింది.
ముహూర్తం షాట్ కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్ మలినేని తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందజేశారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో భాగం కానున్నారు.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.
#VNRTrio movie launched with Megastar @KChiruTweets Garu sounding the clap 🎬
Top directors @dirbobby, @megopichand, @hanurpudi & @BuchiBabuSana graced the grand launch event and wished team the best ❤️@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/92QSaEguLj
— Shiva Kumar B (@ShivaKumarB22) March 24, 2023
తారాగణం: నితిన్, రష్మిక మందన, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సిఈవో: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్