మహిళ సంరక్షణ కోసం సురభి కొత్త ప్రొడక్ట్స్‌లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త ప్రొడక్ట్‌లను నటి ఇంద్రజ లాంచ్ చేశారు. సురభి హైజీన్ ప్రొడక్ట్స్‌లో భాగంగా మూడు రకాల కొత్త ఉత్పత్తులను లాంచ్ చేశారు. సురభి శానిటరీ న్యాప్‌కిన్స్, గ్రో వుమెన్ మెన్‌స్ట్రుయల్ కప్, ఐయామ్ అలర్ట్ పెప్పర్ స్ప్రేను నేడు మార్కెట్లోకి విడుదల చేశారు.
మహిళలకు ఉపయోగపడే ఈ ఉత్పత్తులు సులభంగా అందేలా ఆన్ లైన్‌లోనూ పొందుపర్చినట్టుగా తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఇలా సులభంగా ఉత్పత్తులు మహిళలకు చేరవేయడమే సురభి హైజిన్ ముఖ్య ఉద్దేశ్యం అని సంస్థ సీఈఓ రాజు బిల్లా, శ్రీమతి నిర్మల బిల్లాలు తెలిపారు.
ఈ ఉత్పత్తులను లాంచ్ చేసిన అనంతరం నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ‘మహిళలకు ఉపయోగపడే ఈ ఉత్పత్తులను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తెచ్చిన సురభి వారికి ధన్యవాదాలు. సురభి హైజీన్ ప్రొడక్ట్స్ వారికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.