‘రిచి గాడి పెళ్లి’ మూవీ రివ్యూ

0
628

మూవీ : రిచి గాడి పెళ్లి
రీలిజ్ డేట్: మార్చి 3 2023
నటి నటులు: నవీన్ నేని, సత్య ఎస్ కె, ప్రణీత పట్నాయక్, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, సతీష్ తదితరులు…
ఎడిటర్: అరుణ్ ఇఎమ్
మ్యూజిక్ డైరెక్టర్: సత్యన్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉళఘనాథ్
డైలాగ్స్: రాజేంద్ర వైట్ల
స్టోరీ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మధురి
కో ప్రొడ్యూజర్: సూర్య మెహర్
ప్రొడ్యూజర్: కె.ఎస్.హేమరాజ్
బ్యానర్: కె.ఎస్. ఫిల్మ్ వర్క్స్
స్క్రీన్ ప్లే & డైరెక్షన్: కె.ఎస్. హేమరాజ్

కెఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై కె ఎస్ హేమరాజ్ (KS Hemaraj) దర్శకత్వంలో నవీన్ నేని, సత్య ఎస్ కె, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి నటీనటులు గా నటించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ‘రిచి గాడి పెళ్లి’. డిఫరెంట్ టైటిల్ & ట్రైలర్ తో ఇప్పటికే ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ సినిమా మార్చి 3న గ్రాండ్ గా విడుదలైంది. మరి, ఈ “రిచి గాడి పెళ్లి” ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం?

కథ:

‘రిచి'(సత్య ఎస్ కె) & ‘నేత్ర'(బన్నీవాక్స్) ఇద్దరు గాఢంగా ప్రేమించుకొని విడిపోతారు. కొన్ని రోజులు తరువాత, రిచి(సత్య ఎస్ కె) నుంచి తన ‘ఫ్రెండ్స్’ అందరికి పెళ్లి కబురు వస్తుంది. దాంతో రిచి గ్యాంగ్ అంత ‘ఊటీ’ కి బయలుదేరతారు. అప్పటికే ‘రిచి గ్యాంగ్’ లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ‘లైఫ్ స్టైల్’ లో ఏదొ ఒక ‘వెలితి’ ఉంటుంది. మరి, ఆ వెలితి ఈ రిచి గాడి పెళ్లి ద్వారా సాల్వ్ అయ్యిందా? ఊటీ కి వెళ్లిన రిచి ఫ్రెండ్స్ వల్ల ‘పెళ్ళి’ ఎలాంటి మలుపులు తిరిగింది? ‘నేత్ర’ & ‘రిచి’ మల్లి కలుస్తారా? అనేది కథ.

నటి నటులు పెర్ఫామెన్స్:

సత్య ఎస్ కె తన దైన శైలిలో లవర్ బాయ్ లా యాక్ట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా, స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఒక బాలీవూడ్ స్టార్ ని చూసినట్టు ఫీల్ కలుగుతుంది. ప్రణీత పట్నాయక్ క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉండటంతో పాటు పెర్ఫామెన్స్ అదరకొట్టింది. బన్నీ వాక్స్ రియల్ లైఫ్ లో ఒక యూట్యూబ్ స్టార్. సినిమాలో చాలా హోమ్లీ గా నటిస్తూనే కి రోల్ పోషించింది. నవీన్ నేని ఏ పాత్రలో నైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. తన పెర్ఫామెన్స్ తో సినిమాకి ఒక బ్యూటీ ని తీసుకొచ్చాడు.
లక్ష్మీపతి (సతీష్) గా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు బాగా రాణించారు.

కథనం, విశ్లేషణ:

మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ “రిచి గాడి పెళ్లి”. ఫ్రెండ్స్, కుటుంబాల నేపధ్యం మధ్య ఫోన్ లో సరదాగా సాగే “గేమ్ కాన్సెప్ట్” మూవీ ఇది. ఆ సరదా గేమ్ వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం.

సినిమా ఓపినింగ్ సీన్ లోనే సినిమాటోగ్రాఫర్ తన దైన మార్క్ ని చూపించాడు. “రిచి గాడి పెళ్లి” కోసం ఎవ్వరి వాళ్ళ బిజీ లైఫ్ ని వదిలి రిచి ఫ్రెండ్స్ అందరు ‘ఊటీ’ కి బయలు దేరుతారు. అసలు కథ ఇక్కడే మొదలవ్వుతుంది, లక్ష్మీపతి(సతీష్) సరదాగా సాగే ఒక “గేమ్ కాన్సెప్ట్” లోకి రిచి ఫ్రెండ్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎవ్వరికైతే కాల్ వస్తుందో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అందరి ముందు మాట్లాడాలి. అలా టీమ్ లో కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి వెనక ఏదొక సీక్రెట్ దాగి ఉంటుంది. ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా లవబుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేసాడు డైరెక్టర్ హేమరాజ్. ముఖ్యంగా, నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సతీష్ క్యారెక్టర్ లా బ్యాగ్రౌండ్ స్టోరీస్ ని ప్రేక్షకులు బాగా ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో, అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అనే పాటకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

తెర మీద బన్నీ వాక్స్ & చందన రాజ్ కి సరైన స్క్రీన్ స్పెస్ ఇవ్వకపోవడం. అలాగే, కథ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటె బాగుండేది. పలు ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రాఫర్ గా ఈ సినిమాకి అసెట్. ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కచడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఓవరాల్ గా థియేటర్ లో ప్రతి ప్రేక్షకుడు చూడదగిన సినిమా.

సాంకేతిక నిపుణుల పనితీరు:

రాజేంద్ర వైట్ల & నాగరాజు మధురి అందించిన స్టోరీ కాసేపు స్క్రీన్ మీద ఊరట లభించిన అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపొయ్యారు. స్క్రిప్ట్ విభాగంలో ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే నెస్ట్ లెవెల్ ఉండేది కాబోలు. కె.ఎస్. హేమరాజ్ స్క్రీన్ ప్లే & డైరెక్షన్ లో కొత్త వాడే అయ్యిన తన వంతు కృషి చేసాడు. కాకపోతే, అక్కడక్కడ కొన్ని కంటిన్యూటీ, లాజిక్స్ మిస్ అవ్వడం ఇలాంటి వాటి మీద ఇంకాస్త శ్రద్ద వహించాలిసింది. విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రఫీ విజ్యువల్ గా సూపర్బ్. మ్యూజిక్ డైరెక్టర్ సత్యన్ పర్వాలేదనిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

బాటమ్ లైన్: కామిడి & సెన్స్ బుల్ మూవీ – ‘రిచి గాడి పెళ్లి’
రేటింగ్: 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here