ఫ్యాషన్ జ్యువెలరీ విభాగమైన నీలియాస్ ఎక్స్ క్లూజివ్ 925 వెండి ఆభరణాల స్టోర్ ని బుధవారం మాదాపూర్ లో ప్రారంభించింది. ఈ స్టోర్ ని ప్రముఖ సినీనటి బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో నీలియాస్ తన ప్రత్యేకమైన ఆభరణాల స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీ ని ఇష్టపడుతున్నారు. నేను కూడా బంగారం కన్నా ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీ నే ఇష్టపడ్డతాను. మగవల మనసుకు నచ్చే అనేక ఉత్పత్తులు, డిజైన్లు ఇక్కడ తేలికగా ఎంపిక చేసుకోవచ్చన్నారు. సంప్రదాయ ఆభరణాలకు సరికొత్త మేలవింపుతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రతి ఒక్క మగువ ఈ స్టోర్ ని తప్పకుండా సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు. స్టోర్ నిర్వాహకురాలు వినీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలి అని నిలియాస్ ఎక్స్ క్లూజివ్ 925 జ్యువెలరీ స్థాపించాను. మా వద్ద కుందన్, జిర్కన్, టెంపుల్, కాంటెంపరరీ లతోపాటు పురాతన ప్రత్యేకమైన ఆభరణాలను ఇక్కడ అందుబాటులో ఉంచమన్నారు. హైదరాబాద్ వాసులు ఫ్యాషన్ కి పెద్ద పీట వేస్తారని, అందులో భాగంగానే ఈ స్టోర్ ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తొలిసారిగా తాము పిల్లల కోసం ప్రత్యేక జ్యువెలరీ కలెక్షన్ ను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు ప్రత్యేకమైనవే కాకుండా మంచి నాణ్యతతో రూపొందించిన ఆనరనాలను ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు. ఆభరణాలు www.neelias.com వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ వశిష్ట, ఫ్యాషన్స్ స్టైలిస్ట్ ప్రీతం జుక్కల్కర్, సినీనటులు నందిని రాయ్, కామాక్షి భాస్కర్ల, పాయల్ రాధాకృష్ణ, హర్షిత చౌదరి, రాశి సింగ్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల తో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు.