‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్ సాధించారు శైలేష్ కొలను. ఇప్పుడు ఆయన హిట్ యూనివర్స్‌ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈక్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
నాని మాట్లాడుతూ.. ‘సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. వాల్ పోస్టర్ టీంకు థాంక్స్. పావని శ్రద్దగా, కోమలి వర్షగా చక్కగా నటించారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ వెంకట్ వంటి వారు దొరకడం మా అదృష్టం. సినిమాలోని వయలెన్స్‌ను మీనాక్షి తన అందంతో బ్యాలెన్స్ చేసింది. శ్రీనాథ్ చక్కగా నటించారు. సుహాస్ అద్భుతంగా నటించాడు. యాక్టింగ్ అంటే కటౌట్ అవసరం లేదు. నాకు తెలిసిన నటీనటుల్లో సుహాస్ గొప్ప నటుడు. సురేష్ బొబ్బిలి గారి పాట బాగుంది. శ్రీలేఖ గారు ఇచ్చిన ఉరికే ఉరికే పాట నాకు ఎంతో ఇష్టం. మా సినిమా కోసం చాయ్ బిస్కెట్ టీం చాలా కష్టపడింది. కష్టపడి ప్రిపేర్ అయ్యే బ్యాచ్‌లో శేష్ ఉంటాడు.. నేను కాపీ కొట్టి పాస్ అయ్యే బాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. కానీ శేష్ మాత్రం లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా కంటిన్యూగా సక్సెస్‌లు కొడుతున్నాడు. వీరంతా చేసిన పనికి నాకు కూడా కంగ్రాట్స్ వస్తున్నాయి. వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త చిత్రాలు చేయాలని అనుకున్నాను. కానీ ఆడియెన్స్ అంగీకరిస్తారా? అని అందరూ అన్నారు. కానీ మంచి చిత్రాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మరోసారి నిరూపించారు. మా సినిమాకు సహకరించిన మీడియాకు థాంక్స్. అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్.. మళ్లీ కలుద్దాం.. గట్టిగా కలుద్దాం’ అని అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ.. ‘రిలీజ్‌కు ముందు రోజు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు సపరేట్‌గా షో వేశాం. ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. సోషల్ మీడియాలో రివ్యూలు వచ్చేస్తున్నాయి. కానీ ట్విస్టులు ఎవ్వరూ రివీల్ చేయలేదు. ఉదయం నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అప్పటికే మహేష్ బాబు గారివి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే నేను కాల్ చేశాను. నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్ అన్నారు.. నాకు వెంటనే కంట్లో నీళ్లు తిరిగాయి. నీకు ఎప్పుడూ నేను అన్నలా అండగా ఉంటాను అని అన్నారు. నాకు ఆ మూమెంట్ ఎంతో స్పెషల్‌గా అనిపించింది. ఇక రివ్యూలు వస్తున్నాయి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. కానీ ట్రాఫిక్ వల్ల ఆలస్యమైంది. నా సినిమాకు నేనే వెళ్లలేకపోయాను. అదే నిజమైన సక్సెస్ అని అర్థమైంది. అమెరికాలో ఉన్నప్పుడు నాని లాంటి సినిమాలు తీయాలని, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడని అనుకున్నాను. ఇప్పుడు ఇలా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. పావని ఎంతో సహజంగా నటించింది. అతిథి షార్ట్ ఫిల్మ్ చూసి సుహాస్‌లా నటించాలని అనుకున్నాను. శ్రీనాథ్ కొంచెం నాలానే అనిపిస్తాడు. నేను మణిసార్‌ను ట్రోల్ చేస్తుంటాను. నాకు నచ్చిన వాళ్లనే ట్రోల్ చేస్తాను అని నా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. నా నెక్ట్స్ రెండు సినిమాల్లో కనీసం ఒక్కదాన్నైనా మీరే చేయాలి. గ్యారీ నా క్షణం సినిమాకు ఎడిటర్. నెక్ట్స్ డైరెక్టర్ కూడా కాబోతోన్నాడు. కోమలి స్టన్నింగ్ ట్యాలెంట్. ఆమె డబ్బింగ్ విని ఆశ్చర్యపోయాను. ఈ సినిమాకు బెస్ట్ డబ్బింగ్ ఆమెదే. ప్రొడక్షన్ డిజైనర్ మనిషా నా నెక్ట్స్ సినిమా కూడా చేస్తోంది. శైలేష్ కొలనుకి నేను ఆఫర్ ఇవ్వలేను. అతనే నాకు ఆఫర్ ఇవ్వాలి. ఏ చిన్న దానికైనా ఎంతో వివరణ ఇస్తాడు. ఆయన మనసు ఎంతో మంచిది. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్. సెట్స్‌లో నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చాడు. మీనాక్షి మీద వస్తున్న ప్రశంసలు చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఆమెకు ఇది ఆరంభం మాత్రమే. మళ్లీ ఆమెతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. నేను ఇంత వరకు పని చేసిన ప్రొడక్షన్ కంపెనీల్లో ప్రశాంతి, నాని ప్రొడక్షన్‌లది ది బెస్ట్. నేను ఓ చిన్న మాట చెబితే చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. మనశ్శాంతితో హిట్ సినిమా కొట్టేశాను. నా కెరీర్‌లో ఇంత వరకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులు, ఇండస్ట్రీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు అందరికీ థాంక్స్’ అని అన్నారు.
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. మల్టీప్లెక్సుల్లోనే కాదు.. సింగిల్ స్క్రీన్స్‌లోనూ క్లైమాక్స్‌లో కంటిన్యూగా అరుస్తూనే ఉన్నారు. సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్. మ్యాక్స్ (పెట్) పుట్టినప్పటి నుంచి కూడా హిట్ కోసమే పెంచాం. ఎంతో బాగా నటించాడు. ఈ పెట్‌ను ఎంతో ప్రేమగా పెంచాం’ అని అన్నారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘ఇంత విజయాన్ని ఆస్వాధిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఇండస్ట్రీకి వచ్చి ఏడాది అయింది. నాకు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. నా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు థాంక్స్. ఆర్యా పాత్ర మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇంత మంచి పాత్రను ఇచ్చిన నా డైరెక్టర్ శైలేష్‌కు థాంక్స్. కేడీ (అడివి శేష్) ఆర్య ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. నాకు సహకరించిన శేష్‌కు థాంక్స్. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్, నిర్మాత ప్రశాంతి, నాని గారితో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. నా నుంచి ఇంత మంచి పాటను రాబట్టుకున్న దర్శకుడు శైలేష్‌కు థాంక్స్. సినిమా చివరి పది నిమిషాలు ఎంతో గూస్‌బంప్స్‌లా అనిపించింది. అర్జున్ సర్కార్‌తో మూడో పార్ట్ మీద అంచనాలు పెంచేశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
కోమలి ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం వచ్చిన వాల్ పోస్టర్ నాని గారికి, ప్రశాంతి గారికి థాంక్స్. నిర్మాతగానూ నాని ఇలానే సక్సెస్ సాధిస్తూ ఉండాలి. కేడీ, వర్ష మీద మీమ్స్ వస్తున్నాయి. అడివి శేష్ ఇచ్చిన కో ఆపరేషన్ వల్లే ఇదంతా సాధ్యమైంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్. నాకు మంచి పాత్రను ఇచ్చిన శైలేష్‌కు థాంక్స్’ అని అన్నారు.