హైదరాబాద్ లో మొట్ట మొదటి సారి కె1 ఫ్యాషన్ షో లో తారల సందడి

0
216

హైదరాబాద్ లో మొట్ట మొదటి సారి F1 రేస్ కార్స్ తో…K1 స్టైల్ థీమ్ ఫ్యాషన్ షో మోడల్స్ అదరహో అనిపించారు…

వినూత్న శైలి కె1 పార్టీకి నగరం వేదిక అయ్యింది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించి వావ్ అనిపించింది. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే పార్టీగా ప్రతి ఏడాది ఎదో ఒక థీమ్ తో కని వినీ ఎరగని రితీ లో ఈ కె పార్టీ ఫ్యాషన్ షో అదరహో అనిపిస్తుంది. అదే విధంగా ఆదివారం జలవిహార్ లో కె పార్టీ F1 రేస్ కార్స్ తో కె1 స్టైల్ ఫ్యాషన్ మరియు బాలీవుడ్ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, టాప్ బిజినెస్ మాన్స్ పాల్గొన్నారు. F1 స్టైల్ థీమ్ లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధుల కు అపురూపమైన అనుభూతి పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్ ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here