అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్ బ్యానర్ పై #Ap31 నెంబర్ మిస్సింగ్ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమా నిర్మాత M. నారాయణ స్వామి గారు.
ఈ సినిమాతో బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ లహరి గారు హీరోయిన్ గా మరియు హీరో గా చంటి గారు ఈ సినిమా తో ఇద్దరు తొలిపరిచయం అవుతున్నారు.
దసరా సందర్భం గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని గబ్బర్ సింగ్ కొరియోగ్రాఫర్ VJ గణేష్ మాస్టర్ గారు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ పోస్టర్ ని చూసి వీళ్ళు కొత్త కధతో సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు అల్ ది బెస్ట్. డైరెక్టర్ KVR అలాగే దర్జా సినిమా డైరెక్టర్ అడిషనల్ స్క్రీన్ ప్లే చేయడం గొప్ప విశేషం.
ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీ చాలా ఉత్కంఠగా ఉండబోతుంది. మంచి రచనా విలువలు ఉన్నయని తెలిపారు. ఈ సినిమాకి చాలా పెద్ద టెక్నిషన్స్ మరియు నటీ నటులు పనిచేస్తున్నారు.
ఈ నెల మూడోవారంలో షూటింగ్ పనులు వైజాగ్ పరిసర ప్రాంతంలో జరుగనున్నాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ గారు పాల్గొన్నారు




