డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్స్ గా నటించారు. జి. నాగేశ్వర్ రెడ్డి గారిది ముల కథ. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
దర్శకుడు సూర్య మాట్లాడుతూ “నేను మోహన్ బాబు గారి సంస్థ లో సినిమా చేస్తానని అనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి విష్ణు గారికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, పెద్ద హిట్ అవుతుంది” అని తెలిపారు.
దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ “జిన్నా చిత్రం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న విడుదల అవుతుంది. విష్ణు గారి కెరీర్ లో ఎంటర్టైన్మెంట్ చిత్రాలు అని బ్లాక్ బస్టర్ లే . ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. దర్శకుడు సూర్య చాలా బాగా చేశాడు. ఎంత పెద్ద కాస్టింగ్ తో సినిమా చేయడం చాలా కష్టం, కానీ ఫస్ట్ కాపీ చూసాక బ్లాక్ బస్టర్ సినిమా రెడీ అయింది అని అనుకున్నాను. నేను ఈ సినిమా దర్శకత్వం చేయడం లేదు అని బాధపడను. మోహన్ బాబు గారి బలమే మహిళా ప్రేక్షకులు మరియు మాస్ ప్రేక్షకులు. ఈ చిత్రం లో మహిళలకి సూపర్ గా నచ్చుతుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా అద్భుతంగా ఉంటుంది. కొత్త సన్నీ లియోన్ ని చూస్తారు. విష్ణు గారి పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది. చాలా రిస్కీ షాట్స్ చేశారు, డాన్స్ ఇరగదీసాడు, ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది” అని తెలిపారు.
మంచు విష్ణు గారు మాట్లాడుతూ “మా జిన్నా చిత్రం అక్టోబర్ 21న విడుదల అవుతుంది. చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మించాము. జి నాగేశ్వర రెడ్డి గారి మొల్ల కథ అందించారు, కోన వెంకట్ గారు కథ అందించారు. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 5 న విడుదల అవుతుంది. మా అందరికి ఇది ఒక అద్భుతమైన జర్నీ, సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది” అని తెలిపారు.
నటీ నటులు
విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : అవా ఎంటర్ టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకత్వం ::ఈషన్ సూర్య హెల్మ్
సినిమాటోగ్రఫి : ఛోటా కె. నాయుడు
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్