ప్రేమలు అనేకం అనేదే “లాట్స్ ఆఫ్ లవ్” దర్శక నిర్మాత – విశ్వానంద్ పటార్

0
204
ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “లాట్స్ ఆఫ్ లవ్” ఈ నెల 30 న తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత అయినటువంటి డా. విశ్వానంద్ పటార్ ఈ సినిమా అనుభవాలతో పాటు సొంత విశేషాలను మీడియా విలేకరులతో తో పంచుకుంటూ…
నా పేరు విశ్వానంద్ పటార్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే…. మ్యానేజ్ మెంట్ లో పి హెచ్ డి చేసాను.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనప్పటికీ చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ పై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. ఈనెల 30న విడుదల కాబోతున్న “లాట్స్ ఆఫ్ లవ్ ” చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించాను. ఈ సినిమాకు దర్శకత్వం తో పాటు కథ, మాటలు, మ్యూజిక్ నిర్మాతగా నేనే వ్యవహరించడం వెనుక కారణం ఉంది. మొట్ట మొదటి సినిమా కావడంతో కాస్త బడ్జెట్ కంట్రోల్ పెట్టడంతో పాటు 24 క్రాఫ్ట్ పై అవగాహన ఉండడం వల్లే అన్నీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నా స్నేహితులు కిరణ్, శ్రీనివాస్ లు కూడా నాకు చాలా సపోర్ట్ అందించారు. ఒకరకంగా చెప్పాలంటే వారు లేకపోతే ఈ సినిమా విడుదల దాకా వచ్చేది కాదు. ఏమైనా ఇన్నీ భాద్యతలతో ఒక సినిమా ను విడుదల వరకు తీసుకు రావడం అనేది అంత ఈజీ కాదని అర్థమయ్యింది. ఇక ఈ సినిమాలో నాతో సహా అందరూ కొత్తవారే డాక్టర్ పాత్రకు నేను సూట్ అవుతానని కొందరు అనడంమే కాకుండా కరోనా సమయంలో నేను కూడా సేవాలందించడంతో డాక్టర్ పాత్రకు న్యాయం చేయగలననే నటించడం జరిగింది. ఇక మిగతా వారి విషయానికి వస్తే సెకండ్ లీడ్ లో నటించిన రాజేష్ వదినమ్మ సీరియల్ లో నటించిన వ్యక్తి. ధర్డ్ లీడ్ లో నిహాంత్ నాకు ముందు నుంచి తెలుసు.. నేను అతను కలసి ఒక ఇంగ్లీష్ ఆల్బమ్ సాంగ్ చేసాము. ఈ చిత్రంలో స్వామీజీగా నటించిన కిరణ్ నా స్నేహితుడు అలాగే ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పని చేసాడు. ఇక మిగతా నటీనటులందరినీ ఆడిషన్స్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మా సినిమాలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు కొత్త వారికి అవాకాశం కల్పించడం అంటే ఇష్టం.. అదో గొప్ప వరంగా భావిస్తాను. ఎంతో మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నా అవకాశాలు మాత్రం చాలా అరుదు. అందుకే ఎప్పుడూ కొత్తవారికే నా ప్రాధాన్యత ఉంటుంది. కనుకే ఈ మా లాట్స్ ఆఫ్ లవ్ లో కొత్తవారినే తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమ- తమ పాత్రలకు పూర్తి గా న్యాయం చేశారు. కొత్తవారిలా ఎవరూ నటించలేదు.. బడ్జెట్ విషయానికి వస్తే మొదట అనుకున్న బడ్జెట్ వేరు.. సినిమా పూర్తయ్యేటప్పటికి అయిన బడ్జెట్ వేరు (నవ్వుతూ) మూడింతలు అయ్యింది. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే ప్రొఫెషనల్ లవ్, ఫామిలీ లవ్, డివైన్ లవ్, రొమాంటిక్ లవ్, సెల్ఫ్ లవ్ అనే అయిదు రకాల ప్రేమల మిళితమే ఈ లాట్స్ ఆఫ్ లవ్ సినిమా.. ముఖ్యంగా ఈ చిత్రంలో డివైన్ లవ్ అనే అంకం చాలా కొత్తగా ఉంటుంది. మనల్ని మనమే కాదు ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి అలాగే ప్లాంట్స్ ను కానీ జంతువులను కానీ ఇలా దేనినైనా ప్రేమించే గుణం ఉండాలి, అంతేకాదు ప్రేమ అంటే కేవలం ఇద్దరి ప్రేమికుల మధ్య ఉన్నదే కాదు అనేక రకాలుగా ఉంటుంది ప్రేమ అనేది ఈ సినిమా ద్వారా చూపించాలని మా ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ఒక్కో లవ్ యాంగిల్ కు ఒక్కో సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. ప్రతి పాట అందరి మనసును టచ్ చేసే విధంగా లిరిక్స్ కూడా ఉంటాయి. మొన్న విడుదల చేసిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాట్స్ ఆఫ్ లవ్ సినిమా ను పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరూ చూసే విదంగా మలిచి ఈ నెల 30న ఆంద్ర తెలంగాణ లలో 50 థియేటర్స్ తో సహా యు ఎస్ లో కూడా ఓ 4 థియేటర్సలలో ఓన్ గా రిలీజ్ చేయనున్నాము కనుక ఈ మా ప్రయత్నాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర 10 మంచి కథలు టైటిల్స్ తో సహా రెడీగా ఉన్నాయి.. ఈ మా లాట్స్ ఆఫ్ లవ్ సినిమా ఫలితం బట్టించే నా తదుపరి సినిమా ఎప్పుడు అనేది తెలియపరుస్తాను. సినిమాలపై ఉన్న ఫ్యాషన్ వల్లనే కొత్త కాన్సెప్ట్ లతో కొత్త వారిని ప్రోత్సహిస్తూ, సినిమాలు చేస్తూ…ఉంటాను అని ముచ్చటించారు దర్శక నిర్మాత డా. విశ్వానంద్ పటార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here