మర్డర్ మిస్టరీ “అం అః ” మూవీ రివ్యూ

0
597

 

నటీన‌టులు:

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య‌, సిరి కనకన్, రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
సినిమా : “అం అః ”
ద‌ర్శ‌కుడు:  శ్యామ్ మండ‌ల‌
నిర్మాత‌:  జోరిగె శ్రీనివాస్ రావు
బ్యాన‌ర్స్‌: రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్
కో ప్రొడ్యూస‌ర్‌: అవినాష్ ఎ.జ‌గ్త‌ప్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  ప‌ళ‌ని స్వామి
సినిమాటోగ్రాఫ‌ర్‌:  శివా రెడ్డి సావ‌నం
మ్యూజిక్‌:  సందీప్ కుమార్ కంగుల‌
ఎడిటర్:  జె.పి

ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథతో డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ప్రయోగం చేస్తున్నారు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ ‘అం అః’ చిత్రానికి ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌ పెట్టారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నెల 16 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “అం అః ” చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
ఇది ముగ్గురు స్టూడెంట్స్ యదార్థ కథ. హీరోగా కళ్యాణ్ (సుధాకర్ జంగం ), బల్లు (రాజా ), అరవింద్ (ఈశ్వర్ ) లు మంచి ఫ్రెండ్స్. బీటెక్ ఫినిష్ అయిన తర్వాత క్యాంపస్ జాబ్ లో సెలక్షన్ అయిన సంతోషంలో పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేసి, తిరిగి వస్తున్న టైంలో అనుకోకుండా ఒక మర్డర్ కేస్ లో ఇరుక్కుంటారు. ఆ కేసు నుంచి తప్పించడానికి ఎస్. ఐ రవిప్రకాష్ 20 లక్షలు డిమాండ్ చేస్తాడు. లేకపోతే మర్డర్ కేసులో బుక్ చేస్తాను అంటాడు. వారి లైఫ్, కేరీర్ పాడవుతుందని అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంటారు. ఇటువంటి సిట్యుయేషన్ లో వారి పరిస్థితులు ఎటువంటి పరిణామాలకు దారి తీశాయి. ఎస్.ఐ కు ఇవ్వవలసిన డబ్బు కొరకు కోటిశ్వరుడి కూతురును కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తాయి. అప్పుడు మన ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది. అని సిరి అనే అమ్మాయి కోసం రెక్కీ చేసి కిడ్నాప్ చేస్తారు. అయితే తన కూతురిని కిడ్నాప్ చేసిన వారిని ఎన్కౌంటర్ చేస్తానని ఎస్. ఐ వీరితో చెప్పడంతో మేము కిడ్నాప్ చేసిన అమ్మాయి కోటీశ్వరుని కూతురు కాదు యస్.ఐ కూతురు అని తెలుసుకుంటారు. ఇలా ఒక తప్పు తర్వాత మరో తప్పు చేసుకుంటూ పోతున్న వీరు ముగ్గురు నిజంగా ఆ మర్డర్ చేశారా? లేదా? చేయకపోతే చివరికి వీరు కిడ్నాప్ నుండి మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? నిజంగా వీరు స్టూడెంట్సా లేక కిల్లర్సా? .అనేది తెలుసుకోవాలంటే “అం అః ” సినిమా చూడవలసిందే..

నటీ నటుల పని తీరు
హీరోగా కళ్యాణ్ పాత్రలో నటించిన సుధాకర్ జంగం చాలా మెచ్యూర్డ్ గా చాలా బాగా నటించాడు. ఫ్రెండ్స్ గా నటించిన , బల్లు (రాజా ), అరవింద్ (ఈశ్వర్) లు కూడా చక్కటి నటనను ప్రదర్శించారు. కిడ్నాప్ కు గురైన అమ్మాయి పాత్రలో సిరి తన హావ భావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.. ఎస్. ఐ పాత్రలో రవిప్రకాష్ అద్భుతంగా నటించాడు.ఇంకా ఈ చిత్రంలో రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికృష్ణన్, మునీశ్వరరావు తదితరులు నటించిన వారంతా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణులు
డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో దర్శకుడు శ్యామ్ మండ‌ల‌ అద్భుతంగా తెరకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ కుమార్ కంగుల‌ ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు కొత్తఅనుభూతిని ఇస్తాయి. .మనసే నాదని’ పాట బాగుంది. డి.ఓ.పి శివా రెడ్డి సావ‌నం ఫ్రెమింగ్ వర్క్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసింది..జె. పి ఎడిటింగ్ పని తీరు బాగుంది.రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యానర్స్ పై నిర్మాత జోరిగె శ్రీనివాస్ రావు ఖర్చుకి వెనకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తుది తీర్పు: మర్డర్ మిస్టరీ తరహా కథలను ఇష్టపడే వారికి “అం అః ” ఫుల్ మీల్స్ లాంటిది అని చెప్పవచ్చు

రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here