“డై హార్డ్ ఫ్యాన్” మూవీ రివ్యూ

0
584

సినిమా : డై హార్డ్ ఫ్యాన్

నటీ నటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

బ్యానర్ : శ్రీహాన్ సినీ క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్: చంద్రప్రియ సుబుద్ది
దర్శకుడు: అభిరామ్ M
సంగీతం: మధు పొన్నాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిటర్, VFX – తిరు B
మాటలు: సయ్యద్ తాజూద్దీన

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M దర్శకత్వంలో రూపొందిన చిత్రం డై హార్డ్ ఫ్యాన్. చంద్రప్రియ సుబుద్ధి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి నటించారు. మధు పొన్నాస్ సంగీతం అందించిన ఈ సినిమాకు సయ్యద్ తాజుద్దీన్ మాటలు రాశారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ

ఓ అభిమాని శివ (శివ ఆలపాటి) త‌ను ఎంతగానో అభిమానించే హీరోయిన్‌ (ప్రియాంక శర్మ )ను   క‌ల‌వాల‌నుకుంటాడు. ఒక సెలబ్రిటీ గా ఆమె ఏ ఫంక్షన్ కు వెళ్లినా తను వెళ్ళేవాడు. అయితే తన కలల హీరోయిన్ ప్రియాంక శర్మ బర్త్ డే రోజు ఎంతో గ్రాండ్ గా తన ఫ్యానిజం చూపిద్దామని వెయిట్ చేస్తున్న శివ తన అభిమాన తార ప్రియాంక తన పర్సనల్ అకౌంట్ నుంచి తనకు మెసేజ్ రావడంతో షాక్ కు గురవుతాడు.. ఆ షాక్ లో ఉండగానే తన కలల రాని ప్రియాంక డైరెక్ట్ గా శివ ఫ్లాట్ కు వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఆలా రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక శర్మ డై హార్డ్ ఫ్యాన్ శివ ఇంటికి రావడానికి కారణమేంటి?, తను రావడం వలన ఆ రాత్రి వారి మధ్య ఏం జరిగింది?. అనేది తెలుసు కోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే?

 

నటీ నటుల పనితీరు
టాప్ హీరోయిన్ క్యారెక్టర్ లో ప్రియాంక శర్మ తన గ్లామర్, స్క్రీన్ ప్రెసెన్స్, నటనతో మెప్పిస్తుంది. డై హార్డ్ ఫ్యాన్ గా శివ ఆలపాటి నటనలో చాల ఈజ్ కనబరిచాడు.

అప్ కమింగ్ పాలిటిషియన్ పాత్రలో బేబమ్మగా నటించిన షకలక శంకర్ కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. లాయర్ కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల, డైనమిక్ లాయర్ గా ,ఆదిత్య పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నొయ‌ల్ చాలా చక్కగా నటించారు. ఇంకా కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు ఇలా అందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు

సాంకేతిక నిపుణుల పనితీరు

దర్శకుడు అభిరామ్ డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో పాటు కామెడీ పర్ఫెక్ట్ ఉండేలా చూసుకున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులను ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్విస్ట్ & టర్న్స్ తో సర్ప్రైజ్ చేస్తూ చాలా చక్కగా తెరకెక్కించాడు. అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ తో సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగేలా తెరకెక్కించారు. అలాగే హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు అభిరామ్ M..కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు.

ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. సుకుమార్ దగ్గర పని చేసిన మధు పొన్నాస్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు పరుగే పరుగు పాట బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. తిరు చేసిన ఎడిటింగ్, వి. యఫ్. ఎక్స్ బాగున్నాయి. సయ్యద్ చేసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చక్కగా కుదిరాయి. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన నిర్మాత చంద్రప్రియ సుబుద్ధి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని చాల క్వాలిటీ తో నిర్మించారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. “డై హార్డ్ ఫ్యాన్” సినిమాను నమ్మి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ జరుగుతుంది అనే క్యూరియాసిటీ తో పాటు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఉన్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

రేటింగ్: 3.25/5

చివరగా: ఫ్యాన్ కి సెలబ్రిటీ కి మధ్య లో జరిగే వన్ నైట్ సస్పెన్స్ కామెడీ ఎంటర్టైనర్ “డై హార్డ్ ఫ్యాన్”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here