అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటున్న ‘10th క్లాస్ డైరీస్’

0
173

శ్రీరామ్ హీరోగా అవికా గోర్ హీరోయిన్‌గా గరుడ వేగ అంజి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘10th క్లాస్ డైరీస్’. ఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద అచ్యుత రామారావు, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం జూలై1న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను సైతం మెప్పిస్తోంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ మూవీ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో అవికా గోర్ శ్రీరామ్ కెమిస్ట్రీ, లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అయ్యారు. ఇక శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజల కామెడీ టైమింగ్‌తో సినిమా ఆసాంతం వినోదభరితంగా సాగింది.

గరుడవేగ అంజి కెమెరాపనితనం సినిమాకు ప్లస్ అయింది. సురేష్ బొబ్బలి అందించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈచిత్రానికి ఎడిటర్‌గా ప్రవీణ్ పూడి. సహ నిర్మతగా రవి కొల్లిపర వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here