సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్టు గుడిపూడి శ్రీ‌హ‌రి, నేటి జ‌ర్న‌లిస్టు జెమినీ శ్రీ‌నివాస్ కు ఘ‌న నివాళి

0
133

జ‌ర్న‌లిజంలో ఇప్ప‌టిత‌రం గుడిపూడి శ్రీ‌హ‌రిని ఆద‌ర్శంగా తీసుకోవాలి గుడిపూడి శ్రీ‌హ‌రి, జెమినీ శ్రీ‌నివాస్ సంతాప‌స‌భ‌లో సినీ ప్ర‌ముఖులు

తొలిత‌రం సినీ జ‌ర్న‌లిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ స్థాప‌కుల్లో ఒకెరైన గుడిపూడి శ్రీ‌హ‌రి గ‌త‌నెల‌లో మృతిచెందిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఈత‌రం జ‌ర్న‌లిస్టు జెమినీ శ్రీ‌నివాస్ కూడా హ‌ఠాన్మ‌రణం పొందారు. ఈ సంద‌ర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ ప్ర‌స్తుత క‌మిటీ ఆధ్వ‌ర్యంలో వారిరువురికీ సంతాప స‌భ నిర్వ‌హించింది. గురువారం సాయంత్రం ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ క్ల‌బ్ లో జ‌రిగిన ఈ స‌భ‌కు సీనియర్ నటులు మురళీమోహన్, నిర్మాత ఆదిశేష‌గిరిరావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, ద‌ర్శ‌కులు కాశీ విశ్వ‌నాథ్‌, సీనియర్ దర్శకులు రేలంగి న‌ర‌సింహారావు, ప్రముఖ దర్శకులు వైవిఎస్ చౌద‌రి, నిర్మాతల మండల సెక్రెటరీ ప్రసన్నకుమార్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత గోపీచంద్ పాటు ప‌లువురు హాజ‌రై నివాళుర్ప‌ంచారు.

ప్రముఖ నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ నేను సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలోనే గుడిపూడి శ్రీహరితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో పరిశ్రమ చెన్నై లోనే ఉండేది. కానీ చాలా సినిమాల షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండేవి. షూటింగ్ కు వచ్చిన ప్రతి సారి కూడా శ్రీహరిని కోలుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాయంత్రం పూట సారథి స్టూడియో కో, మరో స్టూడియోకు వచ్చి అందరితో కలివిడిగా మాట్లాడటం జరిగేది. సినిమాల విషయాలు, మంచి సినిమాల గురించి చర్చించడం వంటివి చేస్తూండేవాళ్ళము. ఆయన సమీక్షలు నిర్మొహమాటంగా ఉండేవి. ఎవరినో పొగడటం కోసం కాకుండా సినిమా బాగుంటే బాగుందని, బాగు లేకపోతే ఎందుకు బాగాలేదు, ఎక్కడ బాగాలేదు అనే అంశాలను చాలా చక్కగా వివరించేవారు. తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి అనే అంశాలను కూడా సూచనగా రాసేవారు. మాలాంటి వాళ్ళు అప్ కమింగ్ లాంటి వాళ్ళను పక్కకు తీసుకెళ్లి సలహాలు చెప్పేవారు. తప్పులను సరి చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అని నొప్పించక తానొవ్వక అన్నట్టుగా చెప్పేవారు. జయసుధ కుటుంబంతో కూడా ఆయనకు బాగా ఆత్మీయ అనుబంధం ఉంది. గుడిపూడి శ్రీహరి ఫిలిం జర్నలిజం లో ఒక భీష్ముడు లాంటి వారు . అతి చిన్న వయసులోనే జెమిని శ్రీనివాస్ మనందరికీ దూరమవడం చాలా బాధాకరం. దేవుడు అన్యాయం చేశాడనే అంటాను. శ్రీహరి, శ్రీనివాస్ కుటుంబాలకు ప్రఘాడ సంతాపం తెలియజేస్తున్నాను .

ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ  కొంతమంది ఇది చాలా బాగుందనో, ఇది బాగాలేదనో దురుద్దేశంగా ఆపాదిస్తుంటారు. కానీ శ్రీహరి ఉన్నదున్నట్టుగా రాసేవారు. ఆ రివ్యూను చూసి సినిమాను చూసి ప్రేక్షకులు చాలా మంది సినిమాకు వేళలా ? వద్ద అని డిసైడ్ చేసుకునేవారు. 70 వ దశకంలో అంత బాగా రాసె ఫిలిం జర్నలిస్ట్ తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు భారతదేశంలోనే లేరు అని చెప్పవచ్చు. ఈనాడు పేపెర్ లో రాసినా, ఎక్కడ రాసినా, ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తుల్లో ఆయన ప్రథముడు. గుడిపూడి శ్రీహారిని ఇవ్వాల్టి జర్నలిస్టులు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వాళా కొంతమదని సినిమా బాగుందా? బాగాలేదా? అనేది సినిమా చూడకండానే రివ్యూలు రాస్తున్నారు. ప్రోమో రిలీజ్ అవగానే దానిమీద ఒక అభిప్రాయానికి రావడం ఈ రోజుల్లో జరుగుతోంది. నిర్మాతలు నొచ్చుకున్న పరవాలేదు సినిమా బ్యాడ్ గా ఉంటె రాయండి. మంచి ఉంటే మంచి గురించి రాయాలి. నిర్మాణాత్మకంగా ఈ రోజు జర్నలిస్టులు కూడా ఆయన్ని ఆదర్శనంగా తీసుకుంటే మంచిది. ఇక శ్రీనివాస్ చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం. వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. ఇద్దరి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తున్నాను.

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ, సినిమాతో పాటు జ‌ర్న‌లిజం చెన్నై నుంచి హైద‌రాబాద్ త‌ర‌లి వ‌చ్చింది. అప్ప‌ట్లో స‌మీక్ష‌లు పెద్ద‌గా క‌నిపించేవికాదు. అప్ప‌టిలో పెద్ద‌గా టెక్నాల‌జీలేదు. సితార అనే సినీ ప్ర‌తిక‌ల ద్వారానే తెలిసేవి అందులో రాసిన గుడిపూడి శ్రీ‌హ‌రిగారు త‌మ క‌లంతో ప‌దునుగా, సుతిమెత్త‌గా రాసి ఆలోజింప‌చేసేవారు. ఆయ‌న ప‌ర‌మ‌దించ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఆయ‌న్నుంచి నేటి త‌ర‌లం నేర్చుకోవాల‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ, సినిమారంగంలో విష‌యాలు, క‌లెక్ష‌న్ల రిపోర్ట్ ఒక‌ప్పుడు సినీ వార‌ప‌త్రిక‌ల ద్వారానే తెలిసేది. అప్ప‌ట్లో జ‌ర్న‌లిజం కూడా కొన్ని విలువ‌ల‌తో కూడుకునేలా వుండేది. ఇప్ప‌టి జ‌ర్న‌లిజం త్వ‌ర‌గా తెలియ‌జేయాల‌ని త‌ప‌న‌తో రాసేస్తున్నారు. అలాగే ద‌ర్శ‌కులు కూడా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా సినీస‌మీక్ష‌లు మారిన టెక్నాల‌జీ ద్వారా చూసిన కొద్దిసేప‌ట‌కే వాట్స‌ప్‌లో చెప్పేస్తున్నారు. అప్ప‌ట్లో శ్రీ‌హ‌రి రివ్యూలు సితార‌, జ్యోతిచిత్ర‌, విజ‌య అని ప‌త్రిక‌ల‌లో వ‌చ్చేవి. చ‌దివేవాడిని. నాలుగు స్తంభాల్లో మీడియా ఓ భాగం. బాధ్య‌తాయుత‌మైన వృత్తి. అందుకే ఇప్ప‌టిత‌రంకానీ రేప‌టిత‌రంకానీ జ‌ర్న‌లిజంలో శ్రీ‌హ‌రిగారిని ఆద‌ర్శంగా తీసుకోవాలి. శ్రీ‌హ‌రిగారికంటూ ఓ పేజీ వుంది. దేశంలో మిగిల‌న‌వారికంటే తెలుగు మీడియాకు మంచి గౌర‌వం వుండేది. అందుకే స‌ద్విమ‌ర్శ‌లు సినిమారంగ‌పై చేస్తూ ఆయ‌న‌కు మంచి నివాళిగా ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు కాశీవిశ్వ‌నాథ్ మాట్లాడుతూ, సినిమాల గురించి తెలుసుకోవాలంటే అప్ప‌ట్లో స‌రైన వేదిక‌లు లేవు. కొన్నాళ్ళ‌కు సితార అనే ప‌త్రిక రావ‌డం, జ్యోతిచిత్ర రావ‌డం.. వీటి ఆధారంగానే అభిమానుల‌కు, సినీ నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కు సినీ ప్రియుల‌కు విశేషాలు తెలిసేవి. శ్రీ‌హ‌రిగారు స‌మీక్ష రాశారంటే చ‌దివాక సినిమా చూసేవారు చాలామంది. అలా ఆయ‌న ర‌చ‌న‌లు వుండేవి. అదేవిధంగా నేటి త‌రం జ‌ర్న‌లిస్టు శ్రీ‌ను మ‌ర‌ణించ‌డం దుర‌దృష్ట‌కరం. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ, చెన్నెలో సినీ ప‌రిశ్ర‌మ వుండేది. అప్ప‌ట్లో సినిమాల గురించి ఒక‌టి అరా ప్ర‌తిక‌లు వుండేవి. హైద‌రాబాద్ వ‌చ్చాక జ్యోతిచిత్ర‌, సితార వంటివారి రావ‌డం. వాటిల్లో శ్రీ‌హ‌రిగారు స‌మీక్ష‌లు రాయ‌డం జ‌రిగేది. ఆయ‌న స‌మీక్ష‌ల‌తోపాటు నిర్మాత‌ల‌కు త‌గువిధంగా సూచ‌న‌లు కూడా చేసేవారు. ఇక నేటి త‌రం శ్రీ‌నుగారు చనిపోవ‌డం వారి కుటుంబానికి చాలా బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నా సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు లేఖ‌లో తెలియ‌జేస్తూ, గుడిపూడి శ్రీ‌హ‌రిగారు మ‌ర‌నించ‌డం బాధాక‌రం. నాన్న‌గారితో మంచి అనుబంధం వుంది. వారి స‌మీక్ష‌లు ఆలోజింప‌జేసివిగా వుండేవ‌ని నాన్న‌గారు చెప్పేవారు. ప్ర‌స్తుతం నేను షూటింగ్‌లో వుండ‌డంతో రాలేక‌పోతున్నారు. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుబూతి తెలియ‌జేస్తున్నాన‌ని తెలిపారు.

అదేవిధంగా నిర్మాత‌లు అచ్చిరెడ్డి, ద‌ర్శ‌కుడు ఎస్‌.వి. కృష్ణారెడ్డిలు తెలియ‌జేస్తూ, జ‌ర్న‌లిజంలో విలువ‌గ‌ల వ్య‌క్తి శ్రీ‌హ‌రిగారు. ఆయ‌న స‌మీక్ష‌లు చ‌ద‌వాల‌నే ఆస‌క్తి క‌లిగేది. మేం చేసిన త‌ప్పుల‌ను స‌రిద్దుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డేవి. ప్ర‌స్తుతం నేను షూటింగ్‌లో వుండ‌డంతో రాలేక‌పోయాన‌ని వారి కుటుంబానికి సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సుమన్ టీవీ సినిమా ఎడిటర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ ఒకే నెలలో చిత్ర పరిశ్రమ ఇద్దరు జర్నలిస్టును కోల్పోవడం బాధాకరమన్నారు. గుడిపూడి శ్రీహరి లాంటి సీనియర్ జర్నలిస్టు ఎందరికో మార్గదర్శి అయ్యారన్నారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ, శ్రీ‌హ‌రిగారితో నాకు ప‌రోక్షంగా చాలా అనుబంధం వుంది. నేను హైస్కూల్ చ‌దివేరోజుల్లో మా ఊరిలో లై్బ్రీ వుండేది. అక్క‌డ గురువారం సితార ప‌త్రిక వుండేది. దానికోసం ప్ర‌త్యేకంగా ఎదురుచూసి చ‌దివేవారిలో నేనూ ఒక‌డిని అలాంటి నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ స్థాప‌కుల్లో ఒక‌రైన శ్రీ‌హ‌రి గారి అధ్య‌క్షుడిగా వున్న కాలంలో ప‌లు సార్లు క‌లిశాను. అందుకు ఆయ‌న‌తో చ‌ర్చించి ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు కూడా తీసుకున్నాను. ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడే నేను ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో మెంబర్ గా జాయిన్ అయ్యాను ఇప్పుడు ఆ అసోసియేష‌న్‌కు అధ్య‌క్షుడు రెండోసారి ప్రెసిడెంట్ గా వుంటూ ప‌లు కార్య‌క్ర‌మాలు అందరి సహకారంతో చేపట్టాను. అదేవిధంగా జెమినీ శ్రీ‌నివాస్ నా సంతోషం ప‌త్రిక‌లో ప‌నిచేశారు. యంగ్‌లోనే ఆయ‌న మ‌ర‌ణించ‌డం చాలా బాధాక‌రం. వారి కుటుంబానికి ఎటువంటి సాయం కావాల‌న్నా మేం ముందుంటామ‌ని తెలిపారు.

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకులు వైవిస్ చౌదరి తదితరులు కూడా ప్రసంగించారు.

ఇంకా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు భ‌గీర‌థ‌, ల‌క్ష్మ‌ణ‌రావు, నాగేంద్ర కుమార్‌, వినాయ‌క‌రావు, సుబ్బారావు, లక్ష్మీనారాయణ, తెలుగు వైజే రాంబాబు, లక్ష్మీనారాయణ, రఘు, ఓం ప్ర‌కాష్‌, శ‌క్తిమాన్‌, నాగుగ‌వర, ప‌ర్వ‌త‌నేని రాంబాబు, శివ మ‌ల్లాల, ఆర్‌డి.ఎస్‌. ప్ర‌కాష్‌ త‌దిత‌రులు శ్రీ‌హరి గారితో త‌మ‌కున్న ప‌రిచ‌యాన్ని ఆయ‌న్నుంచి నేర్చుకున్న విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. జెమినీ శ్రీ‌ను కుటుంబానికి మా జ‌ర్న‌లిస్టులు అండ‌గా వుంటార‌ని తెలియ‌జేశారు. ఫలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ట్రెజరర్ పామర్తి హేమసుందరరావు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here