పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ ప్రోమో సంచలనం సృష్టించింది. యూట్యూబ్, మ్యూజికల్ చార్ట్‌లలో నంబర్ వన్ గా ట్రెండింగ్ లో నిలిచింది. దేశం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న ‘అక్డీ పక్డీ’ పూర్తి పాట ఇప్పుడు విడుదలైయింది.
అక్డీ పక్డీ మెస్మరైజింగ్ మాస్ బీట్స్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించింది. పాటలో వినిపించిన సాహిత్యం క్యాచీ గా ఉంటూ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్ ని అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ బ్యాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫ్రెష్ ఉంటూ అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా జోష్ క్రియేట్ చేసింది అక్డీ పక్డీ. సునీల్ కశ్యప్ ఇచ్చిన హుక్ లైన్ లైగర్ విజయ్ డ్యాన్స్ మూమెంట్ లానే అదిరిపోయింది.
లిజో జార్జ్- డిజె చేతాస్ స్వరపరిచిన ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్, స్టన్నింగ్ డ్యాన్స్‌లు అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. డ్యాన్స్ మూమెంట్స్ లో విజయ్ దేవరకొండ గ్రేస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. విజయ్ కి జోడీగా అనన్య పాండే డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. అక్డీ పక్డీ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట తమిళ వెర్షన్ కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు.
విష్ణు వర్ధన్, శ్యామ మలయాళ వెర్షన్ ని ఆలపించగా, సిజు తురవూర్ సాహిత్యం అందించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్ ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్ లు ఆలపించారు. సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్ గా వున్నారు.
లైగర్ నుండి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ సినిమా పై భారీ అంచనాలు, ఆసక్తిని పెంచుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యధిక లైక్స్ సొంతం చేసుకోగా.. ఫస్ట్ గ్లింప్స్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రోమో టాప్ 3 లిస్ట్‌లో ఉండగా, ఈ పాట గతంలోనే వున్న అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది.
లైగర్ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.