సందడిగా “చోర్ బజార్” సక్సెస్ మీట్

0
238

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దక్కింది. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి టెక్నీషియన్స్ అంతా ప్రతిభ చూపించారు. నా గత రెండు చిత్రాల కన్నా చోర్ బజార్ గ్రాండ్ గా ఉందని చెబుతున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు. నాకు ఈ సినిమా బ్యూటిఫుల్ మెమొరీస్ ఇచ్చింది. అన్నారు.

దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ..చోర్ బజార్ తో ఒక కలర్ ఫుల్ కమర్షియల్ సినిమా చేయాలన్న మా ప్రయత్నం ఇవాళ సక్సెస్ అయ్యింది. అన్ని ప్లేస్ ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను ఫస్ట్ టైమ్ ఒక కమర్షియల్ సినిమా చేశాను. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. ఆకాష్ తో పాటు మిగతా టీమ్ అంతా నాకెంతో సపోర్ట్ చేశారు. ఇకపైనా మంచి కమర్షియల్ చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను.

నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ…సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. సినిమా కోసం మేము పడిన శ్రమకు ఫలితాన్ని ఇచ్చారు. మీ ఆదరణతో మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తాం. అన్నారు.

సహ నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ…ఈ నెల 24న మా సినిమా విడుదలవుతుందని తెలియగానే ఓ మాస్ మూవీ చూడాలని ఫిల్మ్ లవర్స్ ఎదురుచూశారు. ఇవాళ వాళ్లకు సినిమా బాగా నచ్చింది. బీ, సీ సెంటర్స్ లో ఆదరణ ఎక్కువగా వస్తోంది. ప్రైమ్ షో ఫిలింస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 550 థియేటర్లలో చోర్ బజార్ సినిమాను విడుదల చేశాం. అన్ని చోట్ల కలెక్షన్స్ బాగున్నాయి. నా మిత్రుడు వీఎస్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. మాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. అన్నారు.

గీత రచయిత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ…ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బచ్చన్ సాబ్ పాటకు థియేటర్ లో రీసౌండ్ వస్తోంది. చోర్ బజార్ ను సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here