డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ట్యాక్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో

0
233

హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా (ఎం.డి) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీ’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిక్కి విజయ్ కుమార్(M.Tech) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్క్ k రాబిన్ సంగీతం అందిస్తుండగా ఉరుకుండారెడ్డి ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆనంద్ పల్లకి వి.ఎఫ్ ఎక్స్ అందిస్తుండగా, టి.సి.ప్రసన్న ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ ట్యాక్సీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన క్రిష్.. ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఈ సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక నిమిషం 59 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతూ సినిమాపై హైప్ పెంచేసింది. వెరీ రేర్ హ్యూమన్ మేడ్ మెటల్ కాలిఫోర్నియం 252 చుట్టూ తిరిగే కథ ఇది అని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. బలవంతుడంటే బలమున్నోడు కాదు బలహీనత లేనోడు.. అలాంటి బలహీనత కలిగిస్తే భగవంతుడైనా బలహీనపడాల్సిందే అనే డైలాగ్ నిజ జీవితం ఎంత స్ట్రాంగ్‌గా ఉండనుండో చెబుతోంది. యుగాలు మారినా యుద్దాలు జరిగినా నమ్మకాన్ని చంపి మోసం గెలవడం మాత్రం మారడం లేదు అనే డైలాగ్ సినిమా కథను రిప్రెజెంట్ చేస్తూ ఆసక్తి పెంచేసింది. చిత్రంలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చూపిస్తూ సినిమా పట్ల ఆసక్తి పెంచేశారు. టెక్నాలజీకి మోసాన్ని ముడిపెడుతూ ఓ డిఫరెంట్ కథాంశాన్ని ఈ ట్యాక్సీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.

యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ‘ట్యాక్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్న చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అంతా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి ఒక్కొక్కటిగా అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు అదే బూస్టింగ్‌తో ట్యాక్సీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

నటీనటులు:
వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత

సాంకేతిక బృందం:
దర్శకత్వం: హరీష్ సజ్జా
నిర్మాత: హరిత సజ్జా
బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్
సంగీతం : మార్క్ k రాబిన్
సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి
విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి
ఎడిటర్: టి.సి.ప్రసన్న
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here