టాలీవుడ్ స్టార్ పి ఆర్ ఓ, జర్నలిస్ట్, నిర్మాత బి ఏ రాజు గారి ప్రథమ వర్ధంతిన తెలుగు సినీ ప్రముఖులు, పాత్రికేయ రంగం ఆయన్ని స్మరించుకుంది. హీరో సుధీర్ బాబు గారు కూడా బి ఏ రాజు గారితో ఆయనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
‘బి ఏ రాజు గారు నాకు, మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. ఆయన నా ఫేవరేట్ పి ఆర్ ఓ. నేను ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో ఎలాంటి సినిమాలు చేయాలి, మంచి టెక్నీషియన్స్ ఎవరు అనే విషయాల మీద ఎన్నో సూచనలు చేసేవారు. ఆయనలో నాకు ఎంతో నచ్చే విషయం ఏంటంటే చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందరినీ ఒకేలాగా చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. ఆయన్ని, ఆయన చిరునవ్వుని మిస్ అవుతున్నాను. ఎక్కడున్నా ఆయన అదే చిరునవ్వుతో ఉంటారని ఆశిస్తున్నాను.’ అన్నారు సుధీర్ బాబు