మహా కవి శ్రీ శ్రీ శ్రీ –  శ్రీ శ్రీ గారికి ప్రేమమయ పుట్టినరోజు శుభాకాంక్షలు

0
403

ఓ మహాను భావా !
మహా కామ్రేడ్ !! మీరూ … సూర్యుడి మల్లే …
అమర వీరులు – చిరంజీవులు .

ఎవరన్నారు మీరు ఇప్పుడు లేరని … ??
ఇప్పుడిప్పుడే ఈ రోజే కొత్త , కొత్తగా మళ్ళీ మీరు
ఉదయించే కిరణం లో ,
చిగురించే అంకురం లో , అమాయకుడు ఆత్మస్త్యురం లో , సైనికుడి దేశభక్తిలో … ఎప్పటికప్పుడే …
విశ్వాన్ని చైతన్యపరిచే రవిజ్వల కిరణమై ,
అరుణోదయ గీతమై , మీరే

ఎవరన్నారు మీరు ఇక్కడ లేరని ??
ఈ విశ్వమంతా అల్లేసి ఉన్నారు
నా ఈ పదాలలో “రాసవాదo లా ”
ఈ విశ్వ మానవ గుండెల్లో
లయకారo లా ..

ఆడ యాడో .. శున్యంలో
ఏ అంధకార గోలానికో ….
కాంతి ని నింపడం కోసం “వేగుచుక్కై ” మీరే …,

ఓ అరాచకపు “రాజ్య ” విమోచనకై … “క్రాంతి ” కాగడాలు వెలిగించడం కోసం నిప్పు రవ్వ అయ్ మీరే ..

ఒక చోట ఆధునిక యువ మదిలో అభ్యుదయ నాట్లు నాటడం కోసం ! రైతు కూలీగా మీరే
మరో చోట శత్రు దేశాల ప్రాబల్యం తో దేశం లో పెరుగుతున్న
కలుపు మొక్కల్ని పీకె “పెద్ద కాపరి ” గా మీరే ,

మీరు ..
ఎఱ్ఱ సైనికులై
విజయ భాస్కరులై
శత ఖంటులై
శతావతారులై
పంచభూతాలై …
కాలాలకు అతీతంగా నిరంతరమూ , నిర్విరామం గా పోరాడుతూనే ఉంటారు
దర్మం కోసం
ఆ శ్రీ రామచంద్రుని
బాణమై .

ఓ విశ్వ కవి … కామ్రేడ్ !!
ఓ మరో ప్రపంచపు మనిషి .

మీరు ఈ దశాబ్దానికేమిటి ! సామీ
ఈ యుగానికే మహాకవి ” .

ఈ యుగానికేంటి సామి ??
ఈ యావత్ మానవ జాతి ఉన్నంత వరకూ ….
మీరే మా మహా కవి 🙏🙏

గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ ఏకలవ్య శిస్యుడు ఈశ్వరుడు 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here