రామ్ చరణ్ సేవా గుణం గురించి కాదంబరి కిరణ్ కుమార్

0
419

మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో
నేను తెలుసుకున్నా..ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని
భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి.
సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది.

గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్ ని సాయం అడిగి 2లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాను. అవికాక సుక్కన్న, మనం సైతం, విజయ్ అన్న, రాము తదితరుల వద్ద లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి చనిపోయినామె  నెలల పాప పేరున FD చేయమని ఇచ్చాం. ఇప్పుడు..ఇన్నిరోజుల తర్వాత  నేను ఎదురుపడితే రామ్ చరణ్ “ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ?” అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి  నాకు గుండె నిండిపోయింది.

బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు—

కాదంబరి కిరణ్, మనం సైతం వ్యవస్థాపకులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here