కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదలవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా రూపొందింది. ఇండియాలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను భారీ లెవల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా బీస్ట్ సినిమాకు రిలీజ్ ముందు అనుకోని షాక్ తగిలింది.
‘బీస్ట్’ సినిమాను కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. అందుకు కారణం.. సినిమాలో పాకిస్థాన్‌కు సంబంధించిన ప్రస్తావన ఉండొచ్చు,తీవ్రవాదం లేదా వయొలెన్స్ అంశాల గురించి సినిమాలో డిస్కషన్స్ చేసుకుని ఉండొచ్చు అని అంటున్నారు. ఇటీవల కాలంలో కువైట్‌లో విడుదలకు సిద్ధమైన మన ఇండియన్ సినిమాల్లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కురుప్.. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఎఫ్ఐఆర్ చిత్రాలను కూడా కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కువైట్ ప్రభుత్వం హింస, తీవ్రవాదం అనే అంశాల గురించి ఎక్కువగా ప్రస్తావించిన సినిమాల సెన్సార్ విషయంలో కువైట్ ప్రభుత్వం చాలా స్ట్రిట్‌గా ఉంది. అందుకనే అలాంటి సినిమాలను నిరభ్యంతరంగా బ్యాన్ చేస్తుంది.



