100 % తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా తెలుగు ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకుంటోంది. అందులో భాగంగా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడానికి వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ బ్లడీ మేరితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ద్వారా ఆమె తెలుగు ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు చందు మొండేటి డిజిటల్ కోసం డైరెక్ట్ చేసిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. మంగళవారం ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన నివేదా పేతురాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే పవర్ ఫుల్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. నివేదా పేతురాజ్ పదునైన కత్తిని పట్టుకుని భయంకరమైన ఓ రూపంతో ఇన్‌టెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నిలుచుని ఉంది. ఇందులో ఆమెకు వైకల్యం ఉన్నప్పటికీ ఆమె తనకు ఎదురు కాబోయే సమస్యను ఎదుర్కొనేంత ధైర్యంగా కనిపిస్తోంది. మేరి తన వారిని రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుందనే విషయం స్పష్టమవుతుంది.
కిరిటీ దామరాజు, రాజ్ కుమార్ కాశీరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఈయన ఇంతకు ముందు సై ఫై థ్రిల్లర్ కుడి ఎడమైతేను నిర్మించాచరు). కార్తికేయ వంటి థ్రిల్లర్ చిత్రంతో దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్న దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. కాల భైరవ సంగీత సారథ్యం వహించారు.
త్వరలోనే బ్లడీ మేరి ఆహాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తెలుగు ఓటీటీ మాధ్యమంలో రీసెంట్‌గా భీమ్లా నాయక్, డీజే టిల్లు, తెలుగు ఇండియన్ ఐడిల్, సెబాస్టియన్, క్వబుల్ మై, అర్జున ఫల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, త్రీ రోజెస్, లాభం, మంచి రోజులు వచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, భామా కలాపం, అనుభవించు రాజా, సర్కార్, చెఫ్ మంత్ర, అల్లుడు గారు, క్రిస్మస్ తాత వంటి వాటితో పాటు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ ఐఎండీబీలోనే నెం.1 షోగా నిలిచింది.