“శివరంజని లక్ష్మీనారాయణ”గా
“మధుర లక్ష్మినారాయణ”గా
“ట్రేడ్ గైడ్ లక్ష్మీనారాయణ”గా
పరిశ్రమవర్గాలకు సుపరిచితులైన “గంజి లక్ష్మీనారాయణ” ఇకలేరు!!!
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం శాశ్వతంగా సెలవు తీసుకున్నారు!!
ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక!
సీనియర్ జర్నలిస్ట్ .. అందరినీ కలుపుకుని పోయే తత్వం.. సింప్లిసిటీలో మేటి అని నిరూపించిన ట్రేడ్ గైడ్ లక్ష్మీ నారాయణ గారు.. వారి జీవనగమనం ఆద్యంతం మ్యాగజైన్ నిర్వాహకుడిగా సినీరంగంతో కొనసాగారు. కష్టం నష్టం బేరీజు వేసుకోకుండా మ్యాగజైన్ ని నడిపించారు. మంచి మనిషి మనసున్న మనిషి యువజర్నలిస్టులను వెన్ను తట్టి ప్రోత్సహించిన మనిషి లేకపోవడం బాధాకరం.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి.. శాంతి. ఆయన అంత్యక్రియల నిమిత్తం కమిటీ నిర్ణయం మేరకు రూ. 25 వేలు పంపించడం జరిగింది.
-సురేష్ కొండేటి
(అధ్యక్షుడు)
లక్ష్మీనారాయణ
(జనరల్ సెక్రటరీ)
మరియు కమిటీ సభ్యులు
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్.



