ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ఇటీవల `నాట్యం` సినిమాలో తన డ్యాన్స్, మరియు నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు.. తాజాగా ఉమెన్స్‌డే సందర్భంగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం `ఫినామినల్ ఉమెన్`కు మోడ్రన్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ పెర్‌ఫామెన్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫినామినల్ ఉమెన్ డ్యాన్స్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రశంసించి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే మూడు లక్షలకుపైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. మన తెలుగు అమ్మాయి, క్లాసికల్ డ్యాన్సర్ జాతీయ స్థాయిలో ప్రసిద్ది చెందిన ఏఆర్ రెహమాన్ ప్రశంసలు అందుకోవడం గర్వించదగిన క్షణం.