రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి కలర్ ఫుల్ ‘ఈ రాతలే’ వీడియో సాంగ్ కు అనూహ్య స్పందన..

0
478

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసారు మేకర్స్. ఈ కలర్ ఫుల్ వీడియో సాంగ్ కు అనూహ్య స్పందన వస్తుంది. పాటను అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇందులో లో 5 అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం పంచ భూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమీ, గాలి.. ఈ లిరికల్ వీడియోలో చూపించారు. దీని కాన్సెప్టు ఏమిటంటే.. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి వాళ్లను చేరుకోవడం.
ఈ పాటలో హీరోయిన్ కోసం హీరో అలాంటి కష్టాలు పడతాడు. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట గురించి పూర్తిగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న ప్రశంసల కంటే అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మార్చ్ 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..

టెక్నికల్ టీమ్:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here