నిర్మాతల్లో ఒకరైన సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఇద్దరు యువకుల కథే ‘7 డేస్ 6 నైట్స్’. టైటిల్ చూసి హారర్ చిత్రమో, మరొకటో అనుకోవద్దు. ఇదొక కూల్ ఎంటర్‌టైనర్. టూర్‌లో జరిగిన సంఘటనలను మా నాన్నగారైన దర్శకుడు ఎంఎస్ రాజు అందంగా చిత్రీకటించారు. ఇద్దరు యువకులుగా నేను (సుమంత్ అశ్విన్), రోహన్ (తొలి పరిచయం) నటించాం. మెహర్ చాహల్, క్రితికా శెట్టిలను కథానాయికలుగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాలో వండర్ ఫుల్ విజువల్స్, రొమాన్స్ తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్స్ హైలైట్ అవుతాయి. నా కెరీర్‌లో ఈ సినిమాలోని క్యారెక్టర్ బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుంది. నాతో పాటు తొటి నటీనటుల పాత్రలు హైలైట్ అవుతాయి” అని అన్నారు.
సహ నిర్మాత జె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ “మా దర్శకుడు ఎంఎస్ రాజు గారు నుంచి వచ్చే మరో క్లాసిక్ ‘7 డేస్ 6 నైట్స్’. ఇదొక లైట్ హార్టెడ్ కామెడీ. యువతీ యువకులకు గిలిగింతలు పెట్టే చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి అత్యంత అద్భుతమైన పనితీరు కబరిచారు. ఈ సినిమాతో మెగా మేకర్ ఎంఎస్ రాజుగారు పదహారేళ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్స్‌లో ఉంటోంది. జునైద్ సిద్ధికీ అందంగా ఎడిటింగ్ చేశారు” అని చెప్పారు.
‘7 డేస్ 6 నైట్స్’లో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి, సుష్మ, రిషికా బాలి తదితరులతో పాటు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, స్టిల్స్: ఎం. రిషితా దేవి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, కో-డైరెక్టర్: యువి సుష్మ, స్పెషల్ పార్టనర్: రఘురాం టి,కో-ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, నిర్మాణ సంస్థలు: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ & ఎబిజి క్రియేషన్స్, సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, రచన – దర్శకత్వం: ఎంఎస్ రాజు.