కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ట్రైల‌ర్ విడుద‌ల‌

0
276

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో  తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి.
స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది.

ఈ రోజు `గుడ్ లక్ సఖి` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. దేశంలో టాప్ షూటర్లను తయారు చేస్తానని జ‌గ‌పతిబాబు ప్రకటించడంతో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌ల‌క్ స‌ఖి గా కీర్తి సురేష్ ప‌రిచ‌యం అవుతుంది. అయితే  కీర్తి పేరును జ‌గ‌ప‌తిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంత‌లో షూటింగ్ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. దాంతో  సఖి మళ్లీ దురదృష్టవంతురాలు అని నిరూపించుకుంటుంది. ఫ‌స్ట్ టైమ్ ఆమె టార్గెట్ రీచ్ అవ‌డంతో ఫెయిల్ అవుతుంది. అయితే జ‌గ‌ప‌తి బాబు ఆమెను ల‌క్ష్యాన్ని చేరుకునేవిధంగా ప్రేరేపిస్తారు.

స్ఫూర్తిదాయకమైన కంటెంట్ తో ట్రైలర్ అంద‌రినీ ఆకట్టుకుంది. అన్ని కమర్షియల్ అంశాల‌ను చేర్చి ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ మూవీగా ఈ సినిమాను మ‌లిచాడు ద‌ర్శ‌కుడు నగేష్ కుకునూర్. చిరంతన్ దాస్ విజువ‌ల్స్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ యొక్క నిర్మాణ విలువలు అగ్రస్థానంలో ఉన్నాయి. కీర్తి సురేష్ విలేజ్ బెల్లె అవతార్ లో సూపర్ కూల్ గా ఉంది. ఆమె ఈ పాత్రను చాలా ఈజ్‌తో చేసింది. ఆమె కోచ్ గా జ‌గ‌ప‌తిబాబు త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు. ఆది పినిశెట్టి  మంచి పాత్ర‌లో క‌నిపించారు.

`గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత  దిల్‌రాజు  సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 28న ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌ తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here