కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ “నా పేరు శివ 2”. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ “నా పేరు శివ 2” సినిమాను రూపొందించారు. క్యాథరైన్ ట్రెసా నాయికగా నటించింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న “నా పేరు శివ” సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. పరిస్థితులు మెరుగపడిన వెంటనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా తెలిపారు.
నటీనటులు – కార్తి, క్యాథరీన్ థెరిసా, కలైయరాసన్ తదితరులు
సాంకేతిక నిపుణులు
సంగీతం – సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ- మురళి. జి
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె ఇ జ్ఞానవేల్ రాజా
రచన దర్శకత్వం – పా రంజిత్
పీఆర్వో – జీఎస్కే మీడియా



