సుందరానికి ముప్ఫై ఆరేళ్ళు…అదేనండీ.. లేడీస్ టైలర్ కి..!

0
587

ఒరేయ్…సీతారావుడూ ..రాత్రి సరస్వతీదేవి కల్లో కనిపించి నాలిక చాపరా…అంది..
చాపితే..ఎంటనేరాస్సింది..ఏంటి..?…బీజాచ్చరాలెహే…
ఈమాటలు పలికిన రాజేంద్రప్రసాద్ ని,పలికించిన తనికెళ్ళ భరణిని ఎప్పటికీ మర్చిపోలేం..!
ఎన్టీవోడు పక్కన నేను …అక్కినేని పక్కన నేను అన్న రాళ్లపల్లి(కోయదొర)..
నేనేది స్టడీగా ఉంటే తప్ప దేన్నీ ఫోటో తీయలేను..శవాన్ని స్మైల్ ప్లీజ్…అన్న ధమ్ (జంబులింగం)… నాగమణి,నీలవేణి,సుజాత,దయా,బట్టలసత్యం,వెంకటరత్నం..ఇలా చెప్పుకుంటూపోతే అబ్బా…అదోలోకం అంతే…! ఇళయరాజా పాటలు..అయ్యబాబోయ్…!
అప్పట్లో క్లాసులు ఎగ్గొట్టి మరీ మావూరు శ్రీనివాసాటాకీసులో చూసిన సినిమా…మా ఇంటిపక్కోడు గొప్పకు పోయి మాబాబుకు చాడీలు(క్లాస్ ఎగ్గొట్టానని )చెప్పిన సినిమా…దీంతో మాబాబు తన చేతి రుచిని నాకు చూపించిన సినిమా… అసలు ఈ సినిమాను టచ్ చేస్తేనే బోలెడన్ని కబుర్లు…అలాంటి ఈ సినిమా వచ్చి ముప్ఫైఆరేళ్లయిందా అనిపిస్తుంది…ఎప్పుడు ఈటీవీ లో వేసినా కొత్తగానే ఉంటుంది మరదేమిటో…ఇలాంటి సినిమా తీసిన వంశీ గారితో ఒక్కఫొటో దిగితే చాలు జన్మ ధన్యం అనిపిస్తుందే.. అలాంటిది. బోలెడన్ని ఫొటోలు, జ్ఞాపకాలు నాకు మిగిలే ఉన్నాయి..🙏💕

– వి రాధాకృష్ణ
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here