నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం నవంబర్ 13న ప్రారంభం

0
113

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.

పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం
నవంబర్ 13, ఉదయం 10:26 గంటలకు ఘనంగా జరగనుంది.

బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారు.

అఖండ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టనున్నారు నందమూరి బాలకృష్ణ.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్

సాంకేతిక బృందం
డైరెక్టర్ : గోపీచంద్ మలినేని
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : తమన్ ఎస్
సీఈఓ : చెర్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here