మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘నీలాంబరి నీలాంబరి…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెలోడీ బ్రహ్మ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో ఇప్పటికే లాహే సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మెలోడీ సాంగ్‌గా ‘నీలాంబరి..’ సాంగ్‌ను విడుదల చేశారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే జంటపై సాగే పాట ఇది. ఈ లిరికల్ వీడియోలో సాంగ్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్, పాట చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా వీక్షించవచ్చు. పాట విడుదల అనంతరం మెగాస్టార్ చిరంజీవి పాటపై స్పందించారు. ‘మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని మరో మారు రుజువు చేస్తున్న నీలాంబరి’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్ర పాడిన ఈ పాటను అనంత శ్రీరాం రాశారు.
‘‘ఆచార్య సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, లాహే సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు నీలాంబరి అనే మెలోడీ సాంగ్‌ను విడుదల చేశాం. తప్పకుండా సాంగ్ కూల్‌గా, బ్రీజీగా ఉంటుంది. ప్రతి పాట కూడా అటు మెగాభిమానులనే కాదు, ప్రేఓకులను కూడా మెప్పించేలా ఉంటుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఆచార్యను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలియజేశారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్, సురేశ్ సెల్వరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్, సురేశ్ సెల్వరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.