4 భాష‌ల్లో 1000 థియేట‌ర్ల‌లో డోన్ట్ బ్రీత్ 2

0
24

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం `డోన్ట్ బ్రీత్`. 2016లో విడుద‌లైన ఈ హార్ర‌ర్ చిత్రానికి సీక్వెల్‌గా డోన్ట్ బ్రీత్ 2 తెర‌కెక్కింది. ఇంగ్లీషు, తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్ల‌లో విడుద‌లకాబోతుంది. ఈనెల 17న సోనీ పిక్చ‌ర్స్ ద్వారా థియేట‌ర్ల‌లో రాబోతుంది. నూత‌న ద‌ర్శ‌కుడు రోడో సాయాగ్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. స్టీఫెన్ లాగ్‌, మేడ్‌లిన్‌గ్రేన్ తండ్రీ కూతుళ్ళుగా న‌టించారు.

కిడ్నాప్‌కు గురైన త‌న 11 ఏళ్ళ కుమార్తె కోసం అంధుడైన తండ్రి ఏం చేశాడు? అదేవిధంగా స్టీఫెన్‌లో దాగివున్న అద్భుత శ‌క్తులు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి? వాటివల్ల ఏం జ‌రిగింది? చివ‌ర‌కు త‌న కుమార్తెను కాపాడుకున్నాడా? లేదా? అనేది ఆస‌క్తిక‌రంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. కాగా, ఈ చిత్రాన్ని దేశ‌వ్యాప్తంగా వెయ్యి ధియేర్ల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌నీ, ఈనెల 17 విడుద‌ల‌కాబోతున్న మా సినిమా ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ క‌లిగిస్తోంద‌ని సోనీ పిక్చ‌ర్స్ ప్ర‌తినిధులు తెలియ‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here