యాక్షన్ హీరో విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. తన స్నేహితుడు ఆర్యతో కలిసి చేస్తోన్న `ఎనిమి` షూటింగ్ పూర్తికావడంతో ప్రస్తుతం విశాల్ తన 31వ చిత్రం(నాట్ ఏ కామన్ మ్యాన్) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. `ఈదు థెవైయో అధువే ధర్మం` అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తు.పా. శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఈ మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బేనర్ పై విశాల్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూట్ జరుగుతోంది. క్లైమాక్స్ కోసం భారీ స్టంట్లు కంపోజ్ చేశారు ఫైట్ మాస్టర్స్. అయితే ఇందులో ఓ స్టంట్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు వెనకవైపు నుండి బలంగా గోడకు తాకడంతో కిందపడిపోయారు విశాల్. ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. దీంతో పిజియోథెరపీస్ట్ డా. వర్మ ఆయనకు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే షూట్‌లో పాల్గొంటారని టీమ్ వెల్లడించింది. హీరో విశాల్ ప్రతిసారీ ఇలా గాయపడుతుండడంతో ఆయన అభిమానులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తుండగా బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రపి భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్, ఎన్ బి శ్రీకాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
#Vishal got severe back injury at #Vishal31 shooting spot ,Hyderabad. While performing climax stunt sequence his back got injured severely like last time. Varma therapist who took care of the treatment already fixed it this time too. pic.twitter.com/HWk5Nb0ZQQ
— BARaju's Team (@baraju_SuperHit) July 21, 2021



