శర్వానంద్, తిరుమల కిషోర్, ఎస్ ఎల్ వి సినిమాస్ ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్

0
254

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని, కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రాఫర్.

నటీనటులు: శర్వానంద్, రష్మికా మందన్నా, ‘వెన్నెల’ కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్‌ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్‌ రాజు తదితరులు…

సాంకేతిక విభాగం
దర్శకుడు: తిరుమల కిశోర్‌
ప్రొడ్యూసర్‌: సుధాకర్‌ చెరుకూరి
బ్యానర్‌: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
సంగీతం; దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్‌ సారంగ్‌
ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: ఏఎస్‌ ప్రకాశ్‌
కొరియోగ్రాఫర్‌: దినేష్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here