ప్రియమైన మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులకు విన్న‌పం

0
409

సూపర్‌స్టార్ కృష్ణ‌గారి అభిమానిగా త‌న ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టిన నాన్న బి.ఎ.రాజుగారు..కృష్ణ‌గారి ప్రోత్సాహంతో సినీ జ‌ర్న‌లిస్ట్‌గా, పి.ఆర్‌.ఓగా మారారు. ప‌లు సినీ ప‌త్రిక‌ల్లో జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తూనే మ‌రో వైపు ఇండ‌స్ట్రీలో అగ్ర క‌థానాయ‌కులు, అప్ క‌మింగ్ హీరోలు, డెబ్యూ హీరోల సినిమాల‌కు పి.ఆర్‌.ఓగా ప‌నిచేశారు. 1500 సినిమాల‌కు పైగా ప‌నిచేసి నెంబ‌ర్ వ‌న్ పి.ఆర్‌.ఓగా ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశారు. ఈ ప్ర‌యాణంలోనే నాన్న‌గారు,.. మా అమ్మ‌గారు జ‌య‌.బితో క‌లిసి సూప‌ర్ హిట్ ప‌త్రిక‌ను స్టార్ట్ చేశారు. ఎంద‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులతో నాన్న‌, అమ్మ సూప‌ర్ హిట్ ప‌త్రిక‌ను ర‌న్ చేశారు. 28 ఏళ్ల నుంచి సినీ మేగ‌జైన్‌గా సూప‌ర్ హిట్ ప‌త్రిక‌ను ఓ బ్రాండ్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేయ‌డ‌మే కాకుండా ఇండ‌స్ట్రీ హిట్ అనే వెబ్‌సైట్‌ను స్థాపించి ర‌న్‌ చేస్తూ వ‌చ్చారు. అయితే విధివ‌శాతు నాన్న‌ అంద‌రికీ దూర‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ హిట్ సినీ ప‌త్రిక‌, ఇండ‌స్ట్రీ హిట్ వెబ్ సైట్ నిర్వ‌హణ‌తో పాటు, పి.ఒర్‌.ఓగా మా త‌ల్లిదండ్రుల అడుగ జాడ‌ల్లోనే న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఎప్ప‌టిలాగానే మీ ఆశీస్సులు, స‌హాయ స‌హ‌కారాల‌ను అందించాల‌ని , ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను…

ఇట్లు

శివ కుమార్‌.బి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here