జీ 5లో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: దర్శకుడు రామ్ నారాయణ్

0
84

అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక్ జైన్, లావణ్య రెడ్డి హీరోహీరోయిన్లుగా మ్యాంగో మీడియా సమర్పణలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ ఐ, రామ్ వీరపనేని నిర్మించిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 13న జీ 5 ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైంది. విడుదల అనంతరం చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో.. జీ 5 ఓటీటీతో పాటు, చిత్ర దర్శకనిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు రామ్ నారాయణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ.. ‘‘జీ 5 ఓటీటీలో విడుదలైన మా చిత్రాన్ని ఇంత చక్కగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా టీమ్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్మాతలు సతీష్ కుమార్ ఐ, రామ్ వీరపనేనిగార్లు చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు. అలాగే సినిమా ఓటీటీలో విడుదలవడానికి ముఖ్యకారణమైన రామ్ గారికి ధన్యవాదాలు. నిర్మాత సతీష్ కుమార్ గారు ఈ సినిమా విషయంలో నన్ను ఎంతగానో నమ్మారు. ఆయన నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతోనే సినిమా ఇంత బాగా తీయగలిగాను. వారందకీ ధన్యవాదాలు. సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియంది కాదు. అందుకే ఓటీటీలో విడుదల చేశాం. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరం హ్యాపీగా ఉన్నాం. సినిమాని ఆదరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్’’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here