వెర్సటైల్ హీరో రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్” అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ‘విరాటపర్వం` ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఉగాది శుభాకాంక్షలతో సాయి పల్లవి స్పెషల్ పోస్టరని విడుదలచేశారు చిత్ర యూనిట్. `మామిడితోరణాలు, బంతిపూల మాలలతో పండుగ శోభను ప్రతిబింబిస్తూ దర్వాజ ముందు కూర్చొని గడపకు పసుపుకుంకుమలు అద్దుతూ..సంప్రదాయ వస్ర్తాల్లో సాయిపల్లవి ఉన్న ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సంయుక్త సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకు ఎస్సెట్ కానున్నాయి. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
తారాగణం:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సమర్పణ: సురేష్ బాబు
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి. సినిమాస్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
స్టంట్స్: స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర
కొరియోగ్రఫీ: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ చాగంటి



