“వకీల్ సాబ్” ఫస్ట్ షో పడగానే ఇది నెక్ట్ లెవెల్ సినిమా అని తెలిసిపోతుంది – సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు

0
53

“ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సినిమా చేయాల‌నే ఫీలింగ్స్ నిజాలు అయ్యాయి.. సినిమా స్టార్ట్ అవ‌డం, షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్‌కి రావ‌డం ఇలా అన్ని అయిపోయాయి. నేను అనుకున్న‌ది కంప్లీట్ చేయ‌గ‌లిగాను అని చాలా తృఫ్తిగా ఉంది..అయితే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఆడియ‌న్స్ అంద‌రూ వావ్ అన్న‌ప్పుడు ఆ ఎంజాయ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది“ అని అన్నారు సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు. ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్‌రాజ్‌, శిరీష్‌ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 9 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ఇంట‌ర్వ్యూ.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయాల‌న్న‌ది మీ 22ఏళ్ల క‌ల‌, సినిమా స్టార్ట్ అయ్యాక మీ జ‌ర్నీ ఎలా సాగింది?
– ఒక బ్యూటిఫుల్ జ‌ర్నీ..ముందు ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి 2020 మే31 రిలీజ్ చేయాలి అనుకుని 2019 డిసెంబ‌ర్‌లో స్టార్ట్ చేశాం. అయితే మ‌ధ్య‌లో లాక్‌డౌన్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ సినిమా మీద ఉన్న పాజిటివ్ వైబ్స్‌తో ఒక సంవ‌త్స‌రం పాటు హోల్డ్ చేయ‌గలిగాం. క‌ళ్యాణ్ గారితో సినిమా అనుకున్న‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ మా జ‌ర్నీ ఒక సినిమాతో ఆగిపోకుండా నెక్ట్స్ లెవ‌ల్‌కి ఎక్స్‌టెండ్ అయ్యింది. ఈ రోజు కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని క‌లిశాను.

దిల్‌రాజు గారిని క‌లవ‌డం లేట్ అయ్యింది అని ‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజీ మీద చెప్పారు క‌దా మీకేమ‌నిపించింది?
– నా సినిమా లైఫ్ మొద‌లైన‌ప్ప‌టినుండి ఉన్న ఒక డ్రీమ్ అచీవ్‌చేయ‌డంతో పాటు ఈ జ‌ర్నీలో వ‌ర్క్ ఈజ్ మై ప్యాష‌న్ అని ప‌వ‌న్‌క‌ళ్యాన్ గారు అర్ధం‌చేసుకున్నారు కాబట్టి ప‌వ‌న్ క‌ళ్యాన్ గారు అలా చెప్పారు అనుకుంటున్నాను. వ‌కీల్‌సాబ్ త‌ర్వాత కూడా మా జ‌ర్నీఅలానే కంటిన్యూ అవుతుంది.

మీరు ఏ హీరోతో సినిమా చేసిన మ‌ళ్లీ దిల్‌రాజుగారితో సినిమా చేయాల‌నుంది అని అంటారు ఆ టెక్నిక్ ఏంటి?
– (న‌వ్వుతూ) ఒక స్టార్ హీరోలతో సినిమా చేస్తున్న‌ప్పుడు స్క్రిప్ట్ కావ‌చ్చు లేదా షూటింగ్ జ‌రుగుతున్న ప్రాసెస్, అలాగే ఆ సినిమాకి సంబందించిన‌ ప్ర‌మోష‌న్‌, ప్రాప‌ర్ రిలీజ్ తో పాటు వారి కంఫ‌ర్ట్ అన్ని క‌చ్చితంగా హ్యాండిల్ చేస్తాను ఆ స్పెష‌ల్ క్వాలిటీ న‌చ్చ‌డం వల్లే హీరోలు నాకు ద‌గ్గ‌ర‌వుతారు అని నేను అనుకుంటున్నాను.

మ‌రే హీరోతోనైనా సినిమా చేయాలని డ్రీమ్ ఉందా?
– ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో సినిమా చేయాలి అనుకునేదానికి రీజ‌న్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నా బిగినింగ్ డేస్‌లో నా సెకండ్ ఫిలిం తొలిప్రేమ లాంటి సినిమాని ఆ క్రేజ్‌ని చూశా.. క‌ళ్యాణ్‌గారికి అది నాలుగ‌వ చిత్రం. సినిమా సినిమాకి అయ‌న గ్రోత్‌ని చూశా కాబ‌ట్టి నేచుర‌ల్‌గానే ఎప్ప‌టికైనా నేను ప్రొడ్యూస‌ర్ అయితే ప‌వ‌న్ క‌ళ్యాన్ గారితో సినిమా చేయాల‌ని అనుకున్నా.. అలా ప్రొడ్యూస‌ర్ అయ్యా 50 సినిమాలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి. కార‌ణాలేమైనా అది కుద‌ర‌లేదు. అందుకోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారితో సినిమా తీస్తే అలా తీయాలి.. ఇలా తీయాలి అని స్ట్రాంగ్‌గా మైండ్‌లో ఉండిపోయింది.

18సంవ‌‌త్స‌రాలుగా దాదాపు 50సినిమాలు చేశారు క‌దా! ఒక నిర్మాత‌గా ఈ సినిమాకి ఏ స్థానం ఇస్తారు?
– ఏ స్థానం అనేది రేపు రిలీజ్ అయ్యాక చెప్ప‌గ‌ల‌ము.. ముందే చెప్ప‌డం సాధ్యం కాదు. ఒక సినిమాకి ఎన్ని అల్టిమేట్‌గా చేసిన‌, అద్భుతంగా చేసిన ఫైన‌ల్‌గా మాట్లాడేది సినిమా లెక్క‌ల గురించి మాత్ర‌మే.. కాబ‌ట్టి రేపు సినిమా లెక్క‌లే మాట్లాడుతాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌, అన్‌లైన్ బుకింగ్స్ చూస్తుంటే ఒక మ్యాజిక్ అయితే చూడ‌బోతున్నాము అనిపిస్తుంది.

ఈ సినిమాకి వేణు శ్రీ‌రామ్‌ని ద‌ర్శ‌కుడిగా ఎంచుకోవ‌డానికి రీజ‌నేంటి?
– వకీల్ సాబ్ కు ముందు ఇద్దరు ముగ్గురు దర్శకులను అనుకున్నాం. అప్పటికి అల్లు అర్జున్ తో శ్రీరామ్ వేణు సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ సినిమాలు లాక్ డౌన్ వల్ల ముందుకు జరుగుతూ వచ్చాయి. అలా ఆ సినిమా లేట్ అవుతుంది కదా అని వకీల్ సాబ్ చేయమని చెప్పాం.

ఈ సినిమా క‌థ‌లో ఏమైనా మార్పులు చేశారా?
– కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా హీరో ఇమేజ్ కు తగినట్లు వకీల్ సాబ్ ఉంటుంది. పింక్ రీమేక్ అనగానే ఇలాంటి సాఫ్ట్ సినిమా ఎందుకు అని చాలా మంది అడిగారు. మేము సినిమా చేస్తున్నాం కాబట్టి అందులో ఏముంటుందనేది మాకు బాగా తెలుసు. ఫార్ములా చెడిపోకుండా, పవన్ గారి ఇమేజ్ కు తగినట్లు శ్రీరామ్ వేణు కథనంపై బాగా కసరత్తు చేశాడు. కథతో పాటు హీరోయిజం హై చేసుకుంటూ వెళ్లారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన సినిమా. కత్తి మీద సాము లాంటి ప్రాజెక్ట్ ఇది. దర్శకుడు చాలా బాగా చేశారు.

సాంగ్స్ గురించి ఎలాంటి డిస్కర్ష‌న్స్ జ‌రిగాయి?
– పవన్ గారిని అనుకున్నప్పుడే సాంగ్స్ ను, ఫైట్స్, ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేశాం. రేపు సినిమా చూశాక చాలా మంది తెలిసిన కథనే అయినా కొత్తగా ఉందని ఫీలవుతారు. త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు.

మీరు పింక్, నెర్కోండపారువై సినిమాలు చూశారు.. ఒక ఆడియ‌న్‌గా వ‌కీల్‌సాబ్ సినిమా ఎలా అనిపించింది?
ఒక ఆడియెన్ గా చెబుతున్నా, పింక్ 50, తమిళ్ చిత్రం నెర్కోండపారువై 70 అయితే వకీల్ సాబ్ ను 100 మీటర్ లో పెట్టొచ్చు. పింక్ నుండి తమిళ్ లో అజిత్ గారితో చేస్తున్నప్పుడు డిఫ‌రెంట్‌గా చూపించారు. మ‌న నేటివిటీ, ప‌వ‌న్‌గారి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నెక్ట్స్ లెవ‌ల్‌కి ఎలా తీసుకెళ్లాలి అని మ‌రిన్ని మార్పులు చేశాం.

ఈ క‌థ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణే ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అని ఎందుకు అనిపించింది?
– ప్రతి స్టార్ కు ఒక ఇమేజ్ ఉంటుంది. ఒక్కో హీరోకు ఒక్కో స్టైల్ ఉంటుంది. కళ్యాణ్ గారు అంటేనే ఓక స్టైల్. ఆయన బిగినింగ్ సినిమాలు చూస్తే, సుస్వాగతం, తొలిప్రేమ‌ ఒక స్టైల్, తమ్ముడు, బద్రి, ఖుషి ఒక్కో స్టైల్. అలా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. ప‌వ‌న్‌గారు చాలా క్యారెక్టర్స్ చేశారు కాని లాయ‌ర్ క్యారెక్ట‌ర్ చేయ‌లేదు ఆయన స్టైల్ ను అడాప్ట్ చేసుకుని వకీల్ సాబ్ చేశాం.

ఈ సినిమా ఈవెంట్‌ల‌లో ‌ఒక నిర్మాత‌గా కాకుండా ఫ్యాన్‌గా మాట్లాడారు..?
– వీళ్లతోనే సినిమా చేయాలనేది నేనెప్పుడూ పెట్టుకోలేదు. ఆల్ మోస్ట్ అందరు స్టార్లతో సినిమాలు చేశాను. ఇకపైనా తీస్తాను. కానీ తొలిప్రేమ అనే సినిమా నా హృదయంలో అలా ఉండిపోయింది. అందుకే ఫ్యాన్ మూమెంట్ నాలో కలిగింది. నాకు తెలియకుండానే ట్రైలర్ రిలీజ్ రోజు ఒక ఉద్వేగం కలిగింది. సోల్ ఫుల్ సినిమా చేయడం అదీ నా డ్రీమ్ హీరోతో అచీవ్ చేయడం బోనస్ గా ఫీలవుతున్నాను. మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి, ప్రభాస్ తో మిస్టర్ పర్ ఫెక్ట్, ఎన్టీఆర్‌తో బృందావ‌నం సినిమా చేసినా అందులో ఏదో ఒక సోల్ వెతుకున్నాను.

* మాస్క్, శానిటైజ్ చేసుకుని సినిమాలు చూడమని చెబుతున్నా. మనకున్న ఎంటర్ టైన్ మెంట్ సినిమా. దాన్ని వదలిపెట్టి ఉండలేం. 15 నెలలైంది ఒక స్టార్ హీరో సినిమా చూడక అవుతోంది. కొందరికి భయాలున్నాయి, చాలా మంది సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉంటూ సినిమా చూడమనేది మా రిక్వెస్ట్.

* సక్సెస్ ఫెయిల్యూర్ కామన్, కానీ ఒక సోల్ ఉన్న కథ మనల్ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయదు. కథ క్యారెక్టర్ లో చాలా విషయం ఉంది. కాబట్టి నా జస్టిమెంట్ ఫెయిల్ అవదు. ఏప్రిల్ 9న ఫస్ట్ షో పడగానే వకీల్ సాబ్ మరో లెవెల్ అని మీరే చెబుతారు. సండే రోజు ఆన్ లైన్ ఓపెన్ అయ్యాయి. ఎన్ని షోస్ ఓపెన్ చేస్తే అన్నీ బుకింగ్ అవుతున్నాయి. యూఎస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాకే మతిపోతుంది. జనాలు ఒక సారి కనెక్ట్ అయితే ఆగరు.

దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ క‌థ‌కు ఎంత వ‌ర‌కూ న్యాయం చేశారు అని మీరు అనుకుంటున్నారు?‌
– దర్శకుడు శ్రీరామ్ వేణు వందకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాకు ఎన్ని సెట్ అయినా చివరకు దర్శకుడే స్క్రీన్ మీదకు చూపించాలి. శ్రీరామ్ వేణు నేను కూడా ఊహించనంత గొప్పగా సినిమా చేశాడు. డబుల్ పాజిటివ్ చూసి హిట్ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. ఫైనల్ మిక్సింగ్ చూసి సూపర్ హిట్ అని చెప్పాను. సక్సెస్ ఫెయిల్యూర్ చూడను. ప్రతి ఒక్కరిలో విషయం ఉంటది. ఒక్కసారి ఫెయిల్ అయ్యారని వారిని దూరం పెట్టను. వారిలో విషయం ఉంటేనే కదా నేను అవకాశం ఇచ్చాను అనుకుంటాను.

‌నెక్ట్స్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్న సినిమాల గురించి?
– శంకర్ రామ్ చరణ్ సినిమా జూలై లేదా ఆగ‌స్ట్‌లో స్టార్ట్ అవుతుంది, థాంక్యూ సినిమా ఫైనల్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. అది అబ్రాడ్‌లో షూట్ చేయాలి. రౌడీ బాయ్స్ సినిమా ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. పాగల్, ఎఫ్ 3 సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో జెర్సీ, హిట్ సినిమాలు రీమేక్ లు చేస్తున్నాము. సల్మాన్ సోదరుడితో మరో రీమేక్ సినిమా ఉంటుంది. త్వరలో అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఎప్పుడు అనేది హీరోగారే ఎనౌన్స్ చేస్తారు. ‌‌‌‌‌‌‌‌‌‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here