అరణ్య సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది: బహుభాషా నటుడు సంపత్ రామ్

0
38

రానా దగ్గుబాటి, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో ప్రభు సాల్మన్ తెరకెక్కించిన సినిమా ఆరణ్య. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అలాగే ఈ సినిమాతో తనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది అంటున్నారు సంపత్ రామ్. తెలుగు, తమిళ సినిమాలతో గత 20 ఏళ్లుగా ఈయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలు చేసిన సంపత్ రామ్.. ఇప్పుడు అరణ్యలో గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాళహస్తి పక్కన కాట్రపల్లి గ్రామంలో జన్మించారు ఈయన. చిన్ననాటి స్నేహితుడు కోలా ఆనంద్.. సంపత్ రామ్ ను సినిమాలకు పరిచయం చేశారు. సంచలన దర్శకుడు శంకర్ నటించిన ముదాళ్వాన్ సినిమాలో ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అజిత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దీనా సినిమాలో మంచి పాత్ర వేశారు. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఎవరైనా ఎపుడైనా సినిమాలో ఒక పాత్రలో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ లో కూడా కీలక పాత్రలో నటించారు. సంపత్ రామ్ తమిళంలో అజిత్, విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్.. మలయాళంలో మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్స్ తో నటించారు సంపత్. ఇప్పటి వరకు దాదాపు 200 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు ఈయన. ఇప్పుడు అరణ్య సినిమాతో తనకు మరింత గుర్తింపు వచ్చిందని సంతోష పడుతున్నారు సంపత్. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్ప.. రానా 1945.. రెజీనా సినిమాలలో నటిస్తున్నారు సంపత్ రామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here