నా జీవితంలో అతి పెద్ద కల అదే.. కాళ భైరవ

0
870

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `తెల్లవారితే గురువారం`. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా సంగీత దర్శకుడు కాళ భైరవ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

* నా తమ్ముడు సింహాతో వరుసగా రెండు సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. అసలు మొదటి సినిమానే కలిసి చేస్తామని అనుకోలేదు. ఇది కూడా అనుకోలేదు. ఇదో కలలా ఉంది. సినిమా అనుకున్నప్పుడు ఒక్కొక్కరిగా సెలెక్ట్ చేశారు. అలా నేను ఈ స్క్రిప్ట్‌లోకి వచ్చాను. ఇక సింహా మూడో సినిమాకు కూడా నేనే సంగీతాన్ని అందిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది.

* చిన్నప్పటి నుంచి మా అభిరుచులు ఒకేలా ఉంటాయి. నా సాంగ్స్ గురించి తను, తన నటన గురించి నేనూ చర్చించుకుంటాము.

* తారక్ అన్నతో మాకు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో రిలేషన్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ అన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే. మా ఫ్యామిలీకి ఎప్పటినుంచో బంధం ఉంది. ఆయనతో పని చేయాలన్నది నా డ్రీమ్. నా జీవితంలోనే అతి పెద్ద కల. నన్ను నేను నిరూపించుకున్నాక తారక్ అన్నతో చేస్తాను.

* పెనిమిటి సాంగ్ విన్నాక తారక్ అన్నకు చాలా నచ్చింది. నేను పాడిన విధానం, ఆ పాట గురించి తారక్ అన్న మాట్లాడారు. ఆ పాటకు నన్ను అనుకోవడం, అది హిట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.

* మత్తవదలరా సినిమా జానర్ వేరు. ఆ సినిమా మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీదే వెళ్తుంది. కానీ తెల్లవారితే గురువారం అనే సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో పాటలు అవసరం. కానీ సందర్భాన్ని బట్టే పాటలు చేశాం. మూడు పాటలు బాగా వచ్చాయి.

* ప్రతీ సినిమాకు నేపథ్య సంగీతం ఎంతో ముఖ్యం. ఈ సినిమా అంతా కూడా రాత్రి పూటే జరుగుతుంది. ఓ రాత్రి మొత్తం క్యారెక్టర్స్‌కు సంబంధించిన ఎమోషనల్ జర్నీ చూపించారు. దానికి ఆర్ఆర్ కూడా బాగా వచ్చింది.

* రెండు పెద్ద సినిమాలు(రంగ్ దే, అరణ్య) వస్తున్నాయ్.. పోటీ ఎందుకు అని.. శనివారం వస్తున్నాం. దాంతో పాటు హోలీ సెలవులు కూడా కలిసి వస్తాయని ఇలా ప్లాన్ చేశాం.

* బాధ్యత అనేది ఎప్పుడూ ఉంటుంది. మత్తువదలరా, కలర్ ఫోటో హిట్ అయ్యాయంటే ఆ క్రెడిట్ మొత్తం నాది కాదు. అయితే ఈ రెండు చిత్రాలు, ఆ కథలకు సంబంధం ఉండదు. అలా రావడం నాకు సంతోషంగా ఉంది. ప్రతీ సారి కొత్తగా చేయాలనే చూస్తుంటాను. అలా రావడం నా అదృష్టం.

* చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. ఎంత ఈజీగా చెబుతున్నాం.. ఎంతలా కన్విన్స్ చేస్తున్నామనేదే ముఖ్యం. చివరకు ఆడియెన్స్ ఒప్పుకున్నాక అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే విషయం పట్టించుకోరు. బాగా చేశామని సంతృప్తి వచ్చాక అలాంటివేమీ ఉండవు.

* మా నాన్న ఎక్కువగా పొగడరు. ఎక్కువగా సలహాలు ఇవ్వరు. కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు సలహాలు, సూచనలు ఇస్తారు. కానీ ఎక్కువగా పొగడరు. ప్రతీ విషయాన్ని దగ్గరుండి చెప్పరు. నేను ఇలా చేద్దామని అనుకుంటున్నాను అని, బాగుంటుందా? అని చెబితే.. సలహాలు ఇస్తుంటారు.

* ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కచ్చితంగా మా నాన్న ప్రభావం తెలిసో తెలియకో ఉంటుంది. కానీ నేను ప్రత్యేకంగా చేయాలని ఆలోచిస్తుంటాను. అయితే నాకు మాత్రం ఆయనే ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. కచ్చితంగా ఆయన ప్రభావం నా మీద ఉంటుంది.

* తమ్ముడి సినిమా అని ప్రత్యేక దృష్టి అని పెట్టను. ఓ సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ ఉంటుంది. కానీ పనిలో అలాంటివి గుర్తుకు రావు. ఎవరి సినిమా అయినా కూడా ఒకేలా చేస్తాం.

* మత్తువదలరా అనే సినిమా అంతా ఒక మూడ్‌లో ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం అలా కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఎక్కువగా నటించేందుకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఎంతో బాగా చేశాడు.

* పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదు. ఏదైనా ఉంటే నేనే అధికారికంగా ప్రకటిస్తాను.

* దర్శకుడికి ఇది మొదటి సినిమా. గతేడాదే సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. కరోనా సమయంలో ఆయన స్క్రిప్ట్‌ను ఇంకా డెవలప్ చేస్తూ వచ్చారు. నవంబర్‌లో మొదలుపెట్టి మార్చి 27కు తీసుకొచ్చారు. చాలా కష్టపడ్డారు.

* సింహాకు ఎప్పుడూ కూడా మ్యూజిక్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సింహా ఎన్నో సినిమాల్లో చేశాడు. నటన అంటే ఆసక్తి ఉండటంతోనే యమదొంగ, విక్రమార్కుడు, మర్యాద రామన్న ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. సినిమా మీద అవగాహన పెంచుకునేందుకు రంగస్థలం కోసం పని చేశాడు.

* తెల్లవారితే గురువారం తరువాత.. ఆకాశం, నాగశౌర్య లక్ష్య, గుర్తుందా శీతాకాలం, చందూ మొండేటి కార్తికేయ 2, నివేదా పేతురాజ్ సినిమాలకు పని చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here