యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్`. తెలుగులో ఫస్ట్ టైమ్ హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ అప్ తమిజా సంగీతాన్ని అందించారు. ఈ మూవీ మర్చి5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్బంగా హీరో సందీప్ కిషన్ ఇంటర్వ్యూ.
నా కెరీర్లో ఒక మైల్స్టోన్ మూవీ
– ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నా 25వ చిత్రం అనే కాదు తప్పకుండా నా కెరీర్లో ఒక మైల్స్టోన్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే ఫుల్ ఫ్యామిలీకి నచ్చే సబ్జెక్ట్ కావాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అన్నింటికంటే ముందు ఒక మంచి విషయం ఆడియన్స్‌కి చెప్పాలి అని తమిళ్ లో పర్తిభన్ దేసింగ్ దర్శకత్వం వహించిన `నాట్పెతునై` లోని ఐడియా మాత్రమే తీసుకుని వారి సలహా మేరకు దాన్ని ఇంకా డెవలప్ చేసి ఈ సబ్జెక్ట్ రెడీ చేయడం జరిగింది. ఔట్పుట్ మేం అనుకున్న దాని కన్నా ఇంకా బెటర్‌గా వచ్చింది. కాబట్టి తప్పకుండా అన్ని గ్రూప్స్వారు ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
అదే మొమరబుల్ ఎక్స్పీరియన్స్
– ఈ మూవీ నాకు ఎన్నో మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇచ్చింది. అయితే రీసెంట్గా డబ్బింగ్, ఆర్ ఆర్ మిక్స్ చేసి ఫైనల్ వెర్షన్ క్లైమాక్స్ చూసి మా టీమ్ అందరూ ఫోన్ చేసి ఏడ్చారు. బాగుంది అని చెప్పడం వేరు కాని వారు ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం నా జీవితంలో మర్చిపోలేను.
కోర్ పాయంట్ డిఫరెంట్‌గా ఉంటుంది.
సినిమా స్పోర్ట్స్ బేస్డ్ అయినప్పటికీ కథలో మంచి ఎమోషన్ ఉంటుంది. లవ్ ట్రాక్, సాంగ్స్, కామెడీతో పాటు స్ట్రాంగ్ ఎమోషన్, చక్కని మెసేజ్ ఉంటుంది. అయితే కోర్ పాయంట్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఒక మోడ్రన్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. విజువల్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా కోసం ఆరు నెలల పాటు హాకీ ట్రైనింగ్ తీసుకున్నా. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేసేటప్పుడు కచ్చితంగా ఆ స్పోర్ట్ లో ప్రావిణ్యం ఉండాలి. బేసిక్ గా అన్ని తెలిసి ఉండాలి. ముందే హాకీ నేర్చుకొవడం వల్ల షూట్ లో నా పని ఈజీ అయింది. సినిమాలో సందీప్ కనిపించడు. హాకీ ప్లేయర్ మాత్రమే కనిపిస్తాడు.
పొలిటికట్ టచ్ ఉండదు
స్పోర్ట్స్ డ్రామాలో చాలా విషయాలు చెప్పొచ్చు. ఇందులో కూడా మేము చాలా విషయాలు చెప్పాము. అయితే ఈ సినిమాలో పొలిటికట్ టచ్ ఉండదు. కాని స్పోర్ట్స్ పర్సన్స్ కి అందాల్సిన గౌరవం దక్కట్లేదని మాత్రం స్ట్రాంగ్ గా చూపించాం. ఆ సన్నివేశాలు చూసి నిజమే కదా అని ప్రతీ ప్రేక్షకుడికి ఫీలవుతాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ గ్రౌండ్‌కోసం ఉంటుంది. మొహాలి స్టేడియంలో వెళ్లి నిలబడితే మన ఫిలింనగర్ అంత ఉంది. ఆ స్టేడియాన్ని ఈ కరోనా సమయంలో జనాలతో ఎలా నింపాలి అని భయమేసింది. ఈ సినిమాలో క్టైమాక్స్లో మాకు ఆపోజిట్ టీమ్‌లో నేషనల్స్ ఆడిన నలుగురు ప్లేయర్స్‌ని ఆడించడం జరిగింది. కేవలం రోజుకి రూ. 5000 తీసుకుని నటించారు. ఆ విషయం తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యమేసింది.
స్టేడియంలో వచ్చే సీన్స్ ఎట్రాక్ట్ చేస్తాయి
నిజానికి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయడం చాలా కష్టం. స్టేడియంలో బాల్ ని ఫాలో అవుతూ షాట్స్ తీయాల్సి ఉంటుంది. ప్రతీ షాట్ ని చాలా కేర్‌ఫుల్ గా తెరకెక్కించాలి. అందుకే స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు ఎక్కువ ప్రిఫర్ చేయరు. దాని వెనుక కష్టం మాములుగా ఉండదు. కానీ సినిమా బాగుంది బాగా ఆడితే ఆ కష్టం మర్చిపోతాం. రేపు థియేటర్స్ లో ఆ స్టేడియంలో వచ్చే సీన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి. ఫెంటాస్టిక్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ఇది.
ఆర్ ఆర్ అదిరిపోతుంది.
హిపాప్ తమిళ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 25 నిమిషాలు ఆర్ ఆర్ అదిరిపోతుంది. తన మ్యూజిక్ సినిమాకి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఈ సినిమాతో 14 మంది కొత్త టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.
క్లీన్ యూ సర్టిఫికేట్
ఈ సినిమా చూసి సెన్సార్ వారు మా టీమ్ అని అభినందించారు. అలాగే క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, మరీ ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ చెబుతూ ఫస్ట్ టైమ్ హాకీ సినిమా చేశారు. తప్పకుండా సక్సెస్ అవుతారు అని చెప్పారు. రేపు థియేటర్లో ఆడియన్స్ కూడా ఇదే చెప్తారు అని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం
నా కెరీర్ లోనే హై బడ్జెట్ సినిమా ఇది. కథతో పాటు నన్ను నమ్మి ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రొడ్యూసర్స్ నిర్మించారు. కంటెంట్ మీద నమ్మకంతో బడ్జెట్ పెరుగుతున్నా పట్టించుకోకుండా సినిమాను నిలబెట్టారు. ఈ సందర్భంగా మా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ గారికి నా స్పెషల్ థాంక్స్. నిజంగా ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
ఈ సినిమా తర్వాత ‘రౌడీ బేబీ` మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. సినిమా చాలా బాగా వచ్చింది.
ఫుల్ లెంగ్త్ లవ్ ఎంటర్టైనర్ అది. తర్వాత నా నిర్మాణంలో వస్తున్న ‘వివాహ భోజనంబు` లో క్యామియో చేశాను. మహేష్ కోనేరు నిర్మాణంలో వేదవ్యాస్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాను. తర్వాత అనిల్ సుంకరగారితో ఒక సినిమా, వివాహ భోజనంబు డైరెక్టర్‌తో ఒక సినిమా చేస్తున్నాను. వీటితో పాటు మరికొన్ని స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి.



