ఏడాది పూర్తి చేసుకున్న సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌’…’హిట్‌2’ అనౌన్స్‌ చేసిన నిర్మాత నాని

0
366

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ కథానాయకుడు విష్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 28) సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని సినిమా సీక్వెల్‌గా ‘హిట్‌ 2’ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.

“హిట్‌’ విడుదలై ఏడాది పూర్తయ్యింది. ‘హిట్’ పార్ట్‌2ను అనౌన్స్‌ చేయడానికి ఇంత కంటే మంచి రోజు లేదు. ఇంతకు ముందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిట్‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) టీమ్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ రుద్రరాజు కనిపించకుండా అమ్మాయి కేసును ఎలా డీల్‌ చేశాడనే కథాంశంతో సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ‘హిట్‌’ సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కె.డి.తో కలిసి టెన్షన్‌తో గోళ్లు కొరికేసుకునేంత ఉత్కంఠతకు లోను చేసే జర్నీని చేయబోతున్నారు” అని నాని ట్వీట్‌ చేశారు.
అసలు ఈ హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కె.డి ఎవరో తెలుసుకోవాలా? అతనితో ఉన్న ఇతర టీమ్‌ సభ్యులు అంటే నటీనటుటులు, సాంకేతిక నిపుణుల వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెబుతోంది చిత్ర యూనిట్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here