మార్చి5న రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల `పవర్ ప్లే`

0
429

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ రోజు వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా స్పెషల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా…

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ – “నేను విజ‌య్‌గారు క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది. క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ – “ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. డెఫినెట్‌గా అంద‌ర్నీ థ్రిల్ చేస్తుంది“ అన్నారు.

చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ – “ఈ వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా ప‌వ‌ర్‌ప్లే టీమ్ త‌రుపున ఒక కాంటెస్ట్ నిర్వ‌హిస్తున్నాం. మీరు మీ వాలైంటైన్‌తో క‌లిసి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తూ ఒక షార్ట్ వీడియో తీసి దానికి @𝘃𝗮𝗻𝗮𝗺𝗮𝗹𝗲𝗲_𝗰𝗿𝗲𝗮𝘁𝗶𝗼𝗻𝘀 ని టాగ్ చేసి మీ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేయండి. ఈ నెల 16వ తారీకు వ‌ర‌కూ మీరు వీడియోస్ పంపొచ్చు. ఫిబ్ర‌వ‌రి 18న ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంటలు దుబాయ్ ట్రిప్ సొంతం చేసుకుంటారు` అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ – “మార్చి 5 ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌-మాట‌లు న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి ఐ. ఆండ్రూ,
సంగీతం సురేష్ బొబ్బిలి‌,
ఎడిటింగ్ ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌ శివ‌,
ఫైట్స్‌ `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌ బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్ వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌ శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం విజ‌య్ కుమార్ కొండా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here