`క్రాక్` విజయం దర్శకుడిగా నా బాధ్యతను మరింత పెంచింది – బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని

0
187

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న థియేట‌ర్‌ల‌లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని హైద‌రాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా
సంక్రాంతికి విడుదలైన క్రాక్ చిత్రం పెద్ద విజయాన్నిసాధించడం ఆనందంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఎనిమిది నెలల విరామంలో ఎంతో సంఘర్షణకు లోనయ్యా ఓటీటీ ద్వారా సినిమాను విడుదల చేయమంటూ ఒత్తిడులు వచ్చాయి. కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా అని బలంగా నమ్మా..అందుకే పట్టుదలగా నిలబడ్డా. ఇప్పుడు థియేటర్స్ లో మాస్ సన్నివేశాలకు వస్తున్న రెస్పాన్స్ ను నేను ముందు ఊహించిందే…

రవితేజ కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది
విడుదల రోజు జరిగిన సంఘటనలు నన్నుషాక్ కు గురిచేశాయి. అలాంటి ఇబ్బందులు ఏ దర్శకుడికి ఎదురుకాకూడదు. మూడు షోలు రద్దు కావడంతో బాధను వర్ణించడానికి మాటలు రాలేదు. ఈ కఠిన సమయంలో ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలిచింది. వినాయక్ గారు, త్రివిక్రమ్ గారు, వంశీ పైడిపల్లి గారు, మంచు మనోజ్, సాయి ధరమ్‌ తేజ్, NV ప్రసాద్ గారు, నాగ వంశీ ఇలా చాలా మంది నాకు ఫోన్ చేసి నాకు మంచి సపోర్ట్ అందించారు. అయితే ఎన్నో అవాంతరాల్ని చాటుకొని సినిమా విజాయన్ని సాధించడం సంతోషాన్నిస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీలో రవితేజ కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది

మెగా కాంప్లిమెంట్స్ బూస్టప్ నిచ్చింది
మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి చాలా సేపు మాట్లాడారు. అలాగే రామ్ చ‌ర‌ణ్‌గారు కాల్ చేసి సినిమా చూడగానే ట్వీట్ చేయాలనిపించింది. చాలా బాగా తీశారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి అని చెప్పారు. మెగా కాంప్లిమెంట్స్ నాకు మంచి బూస్టప్ నిచ్చింది

శృతి యాక్షన్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది
సినిమా విడుదలై వారం దాటిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నది. కథలోని కొత్తదనంతో పాటు వాస్తవిక కోణంలో ఒంగోలు నేపథ్యాన్నితెరపై ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మాస్ యాక్షన్ సినిమాల్లో ఎప్పుడూ విలన్స్ … హీరో ఫ్యామిలీలో ఎవరో ఒకరిని చంపడం కామన్. అందుకే ఆ లీడ్ తీసుకొని అలా జరగదు అని చూపిద్దామనుకున్నాను. అందరు అక్కడ ఏదో ఊహించారు. కానీ నేను రాసుకున్నది వేరు… శృతి హాసన్ యాక్షన్ ఎపిసోడ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది.

చిరంజీవి గారికి మా అబ్బాయి నటన బాగా నచ్చింది
సినిమాలో మా అబ్బాయి సాత్విక్ నటన కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలియకుండా చూశాను. కానీ వాడిలో నీ పోలికలు చూసి గుర్తుపట్టాను అని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారికి వాడి నటన బాగా నచ్చింది. ఇప్పుడు వాడు నన్ను ఏదైనా టూర్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు.

హిందీ రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం వస్తే తప్పకుండా ఆ బాధ్యతల్ని స్వీకరిస్తా. `క్రాక్` సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. క్రాక్ విజయం దర్శకుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. నేను కథలు రాసుకునే విధానంలో ఈ సినిమా మార్చు తీసుకొచ్చింది. ఈ సినిమా స‌క్సెస్ విషయంలో నేను 200 పర్సెంట్ హ్యాపీ. నా తదుపరి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ లో చేయబోతున్నా, లాక్ డౌన్ సమయంలోకథ రాసుకున్నా, విభిన్నమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here