జాతీయ రహదారి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్

0
30

మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న”జాతీయ రహదారి” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ గారి చేతులమీదుగా విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా

సి. కళ్యాణ్ మాట్లాడుతూ ..నరసింహ నంది సినిమాలు గతంలో 1940 లో ఒక గ్రామం..కమలతో నా ప్రయాణం.లజ్జా లాంటి అవార్డ్ సినిమాలు వచ్చాయి.రీసెంట్ గా వచ్చిన యూత్ ఫుల్ మూవీ డిగ్రీ కాలేజ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది.అలాగే జాతీయ రహదారి అనేది మంచి టైటిల్, ఆయన ఏది తీసుకున్నా డీఫ్రెంటుగా ఒక టైటిల్ తోనే జనాల్లోకి రీచ్ అవుతాడు ఫస్ట్. మంచి కొత్త వాళ్ళను ఆదరించడంలో నరసింహ నంది చాలా ముందుంటాడు. ఈ జాతీయ రహదారి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జాతీయ రహదారి ఫస్ట్ లుక్ చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది. కథ స్టోరీ ఆయన త్వరలో వెల్లడిస్తానని అన్నాడు.ఇందులోనటించే కొత్త నటీనటులందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.నరసింహ నంది ఇప్పటి వరకు తీసిన సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి,ఇప్పుడు తీస్తున్న ఈ జాతీయ రహదారి కూడా అవార్డుతో పాటు డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతు. ఇంత వరకు డబ్బులు కోసమే సినిమాలు తీసాను నేను సినిమా తీస్తే డబ్బులు ఎలాగూ వస్తాయి ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు కోసం కుడాఈ సినిమా తీసాను అన్నారు..

డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ… సి.కళ్యాణ్ గారు ఏంతో బిజీగా ఉన్నా మా నిర్మాత అడిగిన వెంటనే ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు ఆయనకు నా ధన్యవాదాలు.సి.కళ్యాణ్ గారి చేతులమీదుగా చేసిన ప్రతి పని మాకెంతో చేయుతనిచ్చాయి. నటీనటులు, రామసత్యనారాయణ గారు ఈ సినిమా కోసం చాలా సహకరించారు. లాక్ డౌన్ డౌన్ టైమ్ లో తీసిన ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తున్నాము.ఈ
జాతీయ రహదారి గురించి కొన్ని విషయాలు త్వరలో వెల్లడించబోతున్నాను.అలాగే త్వరలో టీజర్ కూడా విడుదల చేయ బోతున్నామని చెప్పారు.

నటీనటులు…

మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి…

సాంకేతిక నిపుణులు…

నిర్మాత… తుమ్మలపల్లి రామసత్యనారాయణ
రైటర్, డైరెక్టర్… నరసింహ నంది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..సంధ్య స్టూడియస్
సంగీతం… సుక్కు
పాటలు..మౌనశ్రీ
కెమెరా..మురళి మోహన్ రెడ్డి.
ఎడిటర్… వి.నాగిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here